Warangal | హౌరా రైల్లో పొగలు.. భయాందోళనతో ప్రయాణికుల పరుగులు
Warangal నెక్కొండ వద్ద ఘటన విధాత, వరంగల్: హైదరాబాద్ నుంచి హౌరా వెళ్తున్న ఎక్స్ ప్రెస్ రైల్లో సోమవారం మధ్యాహ్నం ఆకస్మికంగా పొగలు వచ్చాయి. వరంగల్ నుంచి రైలు బయలుదేరిన కొద్దిసేపటికే ఘటన జరిగింది. నెక్కొండ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు నుంచి పొగలను గుర్తించారు. ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఒక్కసారిగా ప్రమాదం జరిగిందనే ఆందోళనతో రైలు దిగి పరుగులు తీశారు. పొగలు వస్తున్న విషయాన్ని గుర్తించి రైలును నిలిపివేశారు. వెంటనే రైల్వే అధికారులు రంగంలోకి దిగారు. […]

Warangal
- నెక్కొండ వద్ద ఘటన
విధాత, వరంగల్: హైదరాబాద్ నుంచి హౌరా వెళ్తున్న ఎక్స్ ప్రెస్ రైల్లో సోమవారం మధ్యాహ్నం ఆకస్మికంగా పొగలు వచ్చాయి. వరంగల్ నుంచి రైలు బయలుదేరిన కొద్దిసేపటికే ఘటన జరిగింది. నెక్కొండ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు నుంచి పొగలను గుర్తించారు. ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు.
ఒక్కసారిగా ప్రమాదం జరిగిందనే ఆందోళనతో రైలు దిగి పరుగులు తీశారు. పొగలు వస్తున్న విషయాన్ని గుర్తించి రైలును నిలిపివేశారు. వెంటనే రైల్వే అధికారులు రంగంలోకి దిగారు. కొద్ది సేపటికి పొగవచ్చిన రైలు చక్రాలను పరిశీలించారు. అక్కడికక్కడే మరమ్మతులు చేపట్టారు. రైలు యథావిధిగా గమ్యస్థానానికి బయలుదేరింది. దీంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.