Sriram sagar | నిండుకుండలా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు

86.5 టీఎంసీలకు చేరిన నీరు Sriram sagar | విధాత: ఉత్తర తెలంగాణ వర ప్రధాయిని, నిజామాబాద్ జిల్లా పోచంపాడు శ్రీరామ్ సాగర్ జలాశయానికి వరద పోటెత్తుతోంది. ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగా, గోదావరి నది ద్వారా ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతోంది. శనివారం జలాశయంలోకి 59 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో పదివేల క్యూసెక్కుల వరద నీటిని కాలువల ద్వారా దిగువ గోదావరి నదిలోకి […]

  • By: Somu    latest    Aug 19, 2023 12:05 AM IST
Sriram sagar | నిండుకుండలా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు
  • 86.5 టీఎంసీలకు చేరిన నీరు

Sriram sagar | విధాత: ఉత్తర తెలంగాణ వర ప్రధాయిని, నిజామాబాద్ జిల్లా పోచంపాడు శ్రీరామ్ సాగర్ జలాశయానికి వరద పోటెత్తుతోంది. ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగా, గోదావరి నది ద్వారా ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతోంది. శనివారం జలాశయంలోకి 59 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

దీంతో పదివేల క్యూసెక్కుల వరద నీటిని కాలువల ద్వారా దిగువ గోదావరి నదిలోకి వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా, ప్రస్తుతం 1090 అడుగులకు నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిలువ 90 టీఎంసీలకు గాను, ప్రస్తుతం 86.500 టీఎంసీలుగా ఉంది.

ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిలువకు చేరువలో ఉన్నందున, దిగువ ప్రాజెక్టు పరివాహక గ్రామాల ప్రజలను ప్రాజెక్టు అధికారులు అప్రమత్తం చేశారు. పశువుల కాపర్లు, చేపల వేటకు వెళ్లే జాలర్లు, రైతులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ప్రాజెక్టుకు జలకళ సంతరించుకోవడంతో నిజామాబాద్ జిల్లాతో పాటు, ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.