Suryapeta | కాంగ్రెస్‌లో కరెంటు మంటలు: మంత్రి జగదీశ్‌రెడ్డి
Suryapeta చేతికి 'చే'యిచ్చి కారెక్కుతున్న నేతలు సూర్యాపేటలో గులాబీ గూటికి సీనియర్ కాంగ్రెస్ నేత పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి జగదీశ్‌రెడ్డి విధాత: వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ చాలు అంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన కాంగ్రెస్‌లో చిచ్చు రేపుతుంది. రేవంత్ ప్రకటనతో విబేధిస్తున్న ఆ పార్టీ కేడర్, బీఆర్ ఎస్ 24గంటల ఉచిత విద్యుత్తును సమర్ధిస్తు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ ను వీడి బీఆర్ ఎస్‌లో చేరుతుండటం ఆసక్తి రేపుతుంది. ఈ క్రమంలో మూడు […]

Suryapeta
- చేతికి ‘చే’యిచ్చి కారెక్కుతున్న నేతలు
- సూర్యాపేటలో గులాబీ గూటికి సీనియర్ కాంగ్రెస్ నేత
- పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి జగదీశ్‌రెడ్డి
విధాత: వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ చాలు అంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన కాంగ్రెస్‌లో చిచ్చు రేపుతుంది. రేవంత్ ప్రకటనతో విబేధిస్తున్న ఆ పార్టీ కేడర్, బీఆర్ ఎస్ 24గంటల ఉచిత విద్యుత్తును సమర్ధిస్తు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ ను వీడి బీఆర్ ఎస్‌లో చేరుతుండటం ఆసక్తి రేపుతుంది.
ఈ క్రమంలో మూడు గంటల విద్యుత్ ప్రకటనను బహిరంగంగా విభేదించిన సీనియర్ కాంగ్రెస్ నేత గోపగాని వేణుధర్ ఏకంగా కాంగ్రెస్‌కు రాజీనామా ప్రకటించి బీఆరెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. బుధవారం సాయంత్రం రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ఆధ్వర్యంలో జాటోత్ రమేష్, చింత రవి, నాగభూషణా చారి, ఎల్లయ్య, చిన వెంకన్న, శ్రీను తదితరులతో పాటు బీఆర్ ఎస్‌లో చేరారు.
పార్టీలో చేరిన వారికి మంత్రి జగదీశ్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతు రైతాంగానికి 24గంటల ఉచిత విద్యుత్తు వద్ధన్న కాంగ్రెస్ పార్టీనే ప్రజలు, ఆ పార్టీ శ్రేణులు వద్ధనుకుంటున్నారని, అందుకే వారంతా బీఆరెస్‌లో చేరుతున్నారని, మునుముందు ఈ చేరికలు జాతరగా సాగుతాయన్నారు.