Tamilnadu | ఆవును చంపినందుకు.. పులుల‌పై ప్ర‌తీకారం తీర్చుకున్న రైతు..

Tamilnadu విధాత‌: ఓ రైతు పులుల‌పై ప్ర‌తీకారం తీర్చుకున్నాడు. త‌న ఆవును పులులు చంపినందుకు ఆ రైతు ర‌గిలిపోయి.. వాటికి విషం పెట్టి చంపేశాడు. ఈ ఘ‌ట‌న త‌మిళ‌నాడులోని నీల‌గిరిలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. నీల‌గిరిలోని ఎమ‌రాల్డ్ గ్రామానికి చెందిన శేఖ‌ర్ అనే రైతు.. ఆవులు, మేక‌ల‌ను పెంచుకుంటూ జీవ‌నం కొన‌సాగిస్తున్నాడు. అయితే ఇందులో ఓ ఆవును రెండు పులులు క‌లిసి చంపాయి. దీంతో రైతు తీవ్ర ఆవేద‌న చెందాడు. అంతేకాదు పులుల‌పై ర‌గిలిపోయాడు. ప్ర‌తీకారం […]

  • Publish Date - September 13, 2023 / 11:05 AM IST

Tamilnadu

విధాత‌: ఓ రైతు పులుల‌పై ప్ర‌తీకారం తీర్చుకున్నాడు. త‌న ఆవును పులులు చంపినందుకు ఆ రైతు ర‌గిలిపోయి.. వాటికి విషం పెట్టి చంపేశాడు. ఈ ఘ‌ట‌న త‌మిళ‌నాడులోని నీల‌గిరిలో చోటు చేసుకుంది.
వివ‌రాల్లోకి వెళ్తే.. నీల‌గిరిలోని ఎమ‌రాల్డ్ గ్రామానికి చెందిన శేఖ‌ర్ అనే రైతు.. ఆవులు, మేక‌ల‌ను పెంచుకుంటూ జీవ‌నం కొన‌సాగిస్తున్నాడు.

అయితే ఇందులో ఓ ఆవును రెండు పులులు క‌లిసి చంపాయి. దీంతో రైతు తీవ్ర ఆవేద‌న చెందాడు. అంతేకాదు పులుల‌పై ర‌గిలిపోయాడు. ప్ర‌తీకారం తీర్చుకోవాల‌నుకున్నాడు. ఇంకేముంది.. చనిపోయిన ఆవు శ‌రీరానికి విష‌పూరిత మందులు రాశాడు. ఇక ఆవును భ‌క్షించిన ఆ పులులు కూడా చ‌నిపోయాయి. ఎనిమిది, మూడేండ్ల వ‌య‌సున్న పులులు చ‌నిపోయిన విష‌యాన్ని నీల‌గిరి ఫారెస్టు అధికారులు గుర్తించారు.

ఈ పులుల క‌ళేబ‌రాల‌కు కొద్దిదూరంలోనే ఆవు క‌ళేబ‌రం కూడా ప‌డి ఉంది. దీంతో ఆవు య‌జ‌మాని శేఖ‌ర్‌ను అదుపులోకి తీసుకుని విచారించ‌గా, చేసిన నేరాన్ని అంగీక‌రించాడు. త‌న ఆవును చంపినందుకే పులుల‌పై ప్ర‌తీకారం తీర్చుకున్నాన‌ని శేఖ‌ర్ స్ప‌ష్టం చేశారు. పులులు విషాహారం తిని చ‌నిపోయాయ‌ని పోస్టుమార్టం నివేదిక‌లో వెల్ల‌డైంది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.