విధాత: మ‌ధ్య‌ప్ర‌దేశ్ ఉజ్జ‌యినిలోని మ‌హాకాళేశ్వ‌ర్ ఆల‌యానికి రికార్డు స్థాయిలో ఆదాయం వ‌చ్చింది. గ‌త ఏడాదితో పోల్చితే ఈ ఏడాది రెట్టింపు ఆదాయం స‌మ‌కూరింది. భ‌క్తుల విరాళాల‌తో పాటు ఇత‌ర మార్గాల ద్వారా మ‌హాకాళేశ్వ‌ర్ టెంపుల్‌కు ఈ ఏడాది రూ. 81 కోట్ల ఆదాయం స‌మ‌కూరిన‌ట్లు ఆల‌య అధికారి గ‌ణేశ్ ధ‌క‌డ్ తెలిపారు. 2021, సెప్టెంబ‌ర్ 1 నుంచి ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 15 మ‌ధ్య‌లో రూ. 81 కోట్ల ఆదాయం రావ‌డం ఆల్ టైం రికార్డు అని […]

విధాత: మ‌ధ్య‌ప్ర‌దేశ్ ఉజ్జ‌యినిలోని మ‌హాకాళేశ్వ‌ర్ ఆల‌యానికి రికార్డు స్థాయిలో ఆదాయం వ‌చ్చింది. గ‌త ఏడాదితో పోల్చితే ఈ ఏడాది రెట్టింపు ఆదాయం స‌మ‌కూరింది. భ‌క్తుల విరాళాల‌తో పాటు ఇత‌ర మార్గాల ద్వారా మ‌హాకాళేశ్వ‌ర్ టెంపుల్‌కు ఈ ఏడాది రూ. 81 కోట్ల ఆదాయం స‌మ‌కూరిన‌ట్లు ఆల‌య అధికారి గ‌ణేశ్ ధ‌క‌డ్ తెలిపారు.

2021, సెప్టెంబ‌ర్ 1 నుంచి ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 15 మ‌ధ్య‌లో రూ. 81 కోట్ల ఆదాయం రావ‌డం ఆల్ టైం రికార్డు అని చెప్పారు. 2016-17లో రూ. 28 కోట్లు, 2017-18లో రూ. 37 కోట్లు, 2020-21లో 40 కోట్ల ఆదాయం వ‌చ్చింది.

భ‌క్తుల‌కు మెరుగైన సౌక‌ర్యాలు క‌ల్పించ‌డంతో.. ఆల‌యానికి భ‌క్తుల తాకిడి ఎక్కువైంద‌ని గ‌ణేశ్ పేర్కొన్నారు. ఇక ద‌ర్శ‌నం కూడా వీలైనంత త్వ‌ర‌గా క‌ల్పిస్తున్నామ‌ని తెలిపారు. దేశంలోని 12 జ్యోతిర్లింగాల‌లో మ‌హాకాళేశ్వ‌ర్ ఆల‌యం కూడా ఒక‌టి.

Updated On 20 Sep 2022 3:04 PM GMT
subbareddy

subbareddy

Next Story