Tesla | భారత్‌లో టెస్లా కారు కొన్న మొదటి వ్యక్తి ఎవరో తెలుసా?
విధాత : ఎలక్ట్రిక్ కార్లకు భారత్ ఎంతో పెద్ద మార్కెట్ అన్న విషయం తెలిసిందే. అయితే ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా (Tesla) ఇంకా భారత్‌లోకి అడుగు పెట్టలేదు. భారత ప్రభుత్వం పెడుతున్న నిబంధనలతో పాటు కార్ల ఉత్పత్తిని ఇక్కడే చేయాలని పట్టుబడుతుండటంతో మస్క్ దానికి ఒప్పుకోవడం లేదు. తాజాగా అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీతో మస్క్ భేటీ అయ్యారు. త్వరలోనే టెస్లా కార్లు భారత రోడ్లుపై పరుగులు పెడతాయని భేటీ […]

విధాత : ఎలక్ట్రిక్ కార్లకు భారత్ ఎంతో పెద్ద మార్కెట్ అన్న విషయం తెలిసిందే. అయితే ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా (Tesla) ఇంకా భారత్‌లోకి అడుగు పెట్టలేదు. భారత ప్రభుత్వం పెడుతున్న నిబంధనలతో పాటు కార్ల ఉత్పత్తిని ఇక్కడే చేయాలని పట్టుబడుతుండటంతో మస్క్ దానికి ఒప్పుకోవడం లేదు.
తాజాగా అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీతో మస్క్ భేటీ అయ్యారు. త్వరలోనే టెస్లా కార్లు భారత రోడ్లుపై పరుగులు పెడతాయని భేటీ అనంతరం ఆయన వ్యాఖ్యానించారు. అయితే టెస్లా ఇండియాలో అమ్మకాలు మొదలపెట్టనంత మాత్రాన ఈ దేశంలో టెస్లా కార్లు లేవని కాదు.. కొన్ని ఇప్పటికే భారత్‌లో తిరుగుతున్నాయి. అసలు మొదట టెస్లా కారు కొన్న భారతీయుడు ఎవరో ఊహించండి.
మీరు అనుకుంటున్నట్లు అంబానీ సోదరులో, అదానీనో, రతన్ టాటనో కాదు.. ఎస్సార్ గ్రూప్ సీఈవో ప్రశాంత్ రుయా. ఆయన 2017లోనే టెస్లా ఎక్స్ ఎస్‌యూవీని ఇంపోర్ట్ చేసుకున్నారు. ఆ కారును నడుపుతూ అప్పుడప్పుడూ మీడియాకు కనిపించారు కూడా. ఎ
స్సార్ గ్రూప్‌ను స్థాపించిన రుయా కుటుంబంలో ప్రశాంత్ రెండో తరం వ్యక్తి. ఎనిమిది బిలియన్ డాలర్ల ఆస్తులున్న ఎస్సార్ గ్రూప్ భవిష్యత్తు టెక్నాలజీలపై పెట్టుబడులు పెట్టడంలో ముందు వరసలో ఉంటుంది.