TS BJP | BRSపై పోరాటం ఆగదు.. మాజీ MP జితేందర్ రెడ్డి

TS BJP విధాత, మహబూబ్ నగర్ ప్రతినిధి: డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చే వరకు మా పోరాటం ఆగదని, అరెస్టులకు బయపడి వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని మాజీ ఎంపీ, BJP నేత జితేందర్ రెడ్డి BRS ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సోమవారం నారాయణపేట నియోజకవర్గ కేంద్రంలో పేదలకు డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వాలని BJP నేతృత్వంలో చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్బంగా పోలీసులు BJP నేతలను అడ్డుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. […]

  • Publish Date - July 24, 2023 / 12:39 AM IST

TS BJP

విధాత, మహబూబ్ నగర్ ప్రతినిధి: డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చే వరకు మా పోరాటం ఆగదని, అరెస్టులకు బయపడి వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని మాజీ ఎంపీ, BJP నేత జితేందర్ రెడ్డి BRS ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సోమవారం నారాయణపేట నియోజకవర్గ కేంద్రంలో పేదలకు డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వాలని BJP నేతృత్వంలో చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్బంగా పోలీసులు BJP నేతలను అడ్డుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని, ప్రభుత్వం ఎంత అడ్డుకుంటే అంత ఉదృతం చేస్తామని జితేందర్‌రెడ్డి పేర్కొన్నారు. అదే విధంగా కొందుర్గు మండలంలో వర్షాలకు కూలీన ఇళ్లను షాద్ నగర్ నియోజకవర్గం BJP ఇంచార్జ్ శ్రీవర్ధన్ రెడ్డి పరిశీలించి భాధితులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇచ్చే ఉద్యమం ఆగదని ఆయన పేర్కొన్నారు.