Uttam Kumar Reddy | నా పార్టీ మార్పు ప్రచారం ఇంటి దొంగల పనే
Uttam kumar Reddy విధాత: నేను కాంగ్రెస్ పార్టీని వీడి బీఆరెస్‌లో చేరుతున్నట్లుగా సోషల్ మీడియాలో, మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తమని, పార్టీ మారుతున్నానంటు చేస్తున్న ప్రచారం సొంత పార్టీకి చెందిన ఇంటి దొంగలపనేనని, కాంగ్రెస్‌లో కీలక పదవిలో ఉన్న నాయకుడే పార్టీలో నా స్థానాన్ని, ప్రజల్లో నా ప్రతిష్టను దిగజార్చేందుకే ఇలాంటి దుష్ప్రచారం చేయిస్తున్నారని పీసీసీ మాజీ చీఫ్, ఎంపీ ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శనివారం విడుదల చేసిన లేఖలో సంచలన ఆరోపణలు చేశారు. గత […]

Uttam kumar Reddy
విధాత: నేను కాంగ్రెస్ పార్టీని వీడి బీఆరెస్‌లో చేరుతున్నట్లుగా సోషల్ మీడియాలో, మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తమని, పార్టీ మారుతున్నానంటు చేస్తున్న ప్రచారం సొంత పార్టీకి చెందిన ఇంటి దొంగలపనేనని, కాంగ్రెస్‌లో కీలక పదవిలో ఉన్న నాయకుడే పార్టీలో నా స్థానాన్ని, ప్రజల్లో నా ప్రతిష్టను దిగజార్చేందుకే ఇలాంటి దుష్ప్రచారం చేయిస్తున్నారని పీసీసీ మాజీ చీఫ్, ఎంపీ ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శనివారం విడుదల చేసిన లేఖలో సంచలన ఆరోపణలు చేశారు. గత రెండేళ్లుగా నాపై తప్పుడుగా, పరువు నష్టం కల్గించే కథనాలు రావడం తనకు తీవ్ర బాధను కల్గించిందన్నారు. ఈ విషయాన్ని పార్టీ పెద్దలకు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. పార్టీలోని నా సహచరులను, అనుచరులను అణిచివేసే, తొలగించే లక్ష్యంతో కూడా దుష్ప్రచారం చేశారన్నారు. పార్టీలో కొన్ని పరిణామాల పట్ల తాను అసంతృప్తి ఉన్నప్పటికి జాతీయ పార్టీ అంతర్గత ప్రజాస్వామ్య విధివిధానాలకు కట్టుబడి ఉంటానని, బయట లేదా మీడియాతో వాటిని ప్రస్తావించబోనన్నారు.
సూటిగా చెప్పాలంటే నేను ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో లేదా రాజ్‌భవన్‌లో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో, ప్రత్యేక తెలంగాణ సమస్యపై పి.చిదంబరం అధికారిక సర్వసభ్య సమావేశంలో తప్ప ఇప్పటివరకు తాను సీఎం కేసీఆర్‌ను కలువలేదు..మాట్లాడలేదన్నారు. నాకు ఏ ప్రభుత్వంతోనూ వ్యాపారం, ఒప్పందాలు, భూ ఒప్పందాలు లేవన్నారు. నన్ను లక్ష్యంగా చేసుకున్న సొంత కాంగ్రెస్ పార్టీ నేతతో సన్నిహితంగా ఉన్న యూ ట్యూబ్ చానల్స్, మీడియా సంస్థలు నా గురించి, నా భార్య గురించి తప్పుడు, పరువు నష్టం కల్గించే కథనాలు ప్రచారం చేయడం తమను తీవ్ర వేదనకు గురి చేసిందన్నారు. మాజీ సైనికుడిగా దేశ రక్షణకు ప్రాణాలు ఫణంగా పెట్టి చైనా, పాకిస్తాన్ సరిహద్దుల్లో భారత వైమానిక దళంలో ఫైటర్ పైలట్‌గా పనిచేశానని, భారత రాష్ట్రపతుల వద్ద సీనియర్ అధికారిగా పనిచేస్తు ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరానన్నారు. 1994తర్వతా వరుసగా ఆరుఎన్నికల్లో గెలుపొందానని, ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఎన్నికవ్వడం నా అదృష్టమని, ఉమ్మడి ఏపి గృహనిర్మాణ మంత్రిగా స్వతంత్ర భారత దేశంలో అతిపెద్ద గృహనిర్మాణ కార్యక్రమాన్ని పర్యవేక్షించానని గర్వంగా చెబుతున్నానన్నారు.
30ఏళ్లు కాంగ్రెస్ పార్టీ విధేయుడిగా కొనసాగుతున్నానని, నా భార్య పద్మావతి రెడ్డి ఒక పర్యాయం కోదాడ ఎమ్మెల్యేగా గెలిచి, 2018ఎన్నికల్లో కొద్ది తేడా ఓడిపోయిందన్నారు. కోదాడలో ఉంటు పద్మావతి పీసీసీ ఉపాధ్యక్షురాలిగా ప్రజల కోసం పనిచేస్తున్నారని, మాకు పిల్లలు లేరని, మా జీవితంలోని మొత్తం సంవత్సరాలు, మా సంపద, మా ఆరోగ్యం, మాకుటుంబ జీవితం సహా మా జీవితంలోని ప్రతిదానిని కాంగ్రెస్ పార్టీ సేవకు, ప్రజాసేవకు అందించామని ఉత్తమ్ పేర్కోన్నారు. అత్యున్నత స్థాయి సమగ్రత, నిబద్ధతతో 24గంటలు, 365రోజులు పార్టీ తరుపున ప్రజల కోసం పనిచేస్తామన్నారు.
తాము కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, బీఆరెస్‌లో చేరుతున్నారనే నిరాధారణమైన తప్పుడు కథనాలను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా తెలిపారు.