Chandrayaan-3 | చంద‌మామ మ‌రోవైపు ఫొటోలు పంపిన విక్ర‌మ్‌

23న ల్యాండింగ్ అనువైన ప్ర‌దేశానికి వెతుకుతున్న చంద్ర‌యాన్‌-3 ల్యాండ‌ర్‌ Chandrayaan-3 | విధాత‌: చంద్ర‌యాన్-3 విక్ర‌మ్ ల్యాండ‌ర్ త‌న ప‌నిని అప్ప‌డే ప్రారంభించింది. ద‌క్షిణ ధ్రువం వైపు సుర‌క్షితంగా దిగేందుకు సాఫ్ట్ ల్యాండింగ్‌కు అనువైన ప్ర‌దేశం కోసం అన్వేషిస్తున్న‌ది. ఈ క్ర‌మంలో భూమికి ఎప్ప‌డూ క‌నిపించ‌ని అవత‌లి వైపు జాబిల్లి ఫొటోల‌ను విక్ర‌మ్ త‌న కెమెరాలో బంధించింది. ఈ నెల 19న విక్ర‌మ్ ల్యాండ‌ర్ ఈ ఫొటోలు తీసిన‌ట్టు ఇస్రో తెలిపింది. ఇందుకు సంబంధించిన నాలుగు ఫొటోలను […]

  • Publish Date - August 21, 2023 / 06:47 AM IST
  • 23న ల్యాండింగ్ అనువైన ప్ర‌దేశానికి
  • వెతుకుతున్న చంద్ర‌యాన్‌-3 ల్యాండ‌ర్‌

Chandrayaan-3 | విధాత‌: చంద్ర‌యాన్-3 విక్ర‌మ్ ల్యాండ‌ర్ త‌న ప‌నిని అప్ప‌డే ప్రారంభించింది. ద‌క్షిణ ధ్రువం వైపు సుర‌క్షితంగా దిగేందుకు సాఫ్ట్ ల్యాండింగ్‌కు అనువైన ప్ర‌దేశం కోసం అన్వేషిస్తున్న‌ది. ఈ క్ర‌మంలో భూమికి ఎప్ప‌డూ క‌నిపించ‌ని అవత‌లి వైపు జాబిల్లి ఫొటోల‌ను విక్ర‌మ్ త‌న కెమెరాలో బంధించింది. ఈ నెల 19న విక్ర‌మ్ ల్యాండ‌ర్ ఈ ఫొటోలు తీసిన‌ట్టు ఇస్రో తెలిపింది. ఇందుకు సంబంధించిన నాలుగు ఫొటోలను ఇస్రో (ISRO) సోమ‌వారం ట్విట్ట‌ర్‌లో పోస్టు చేసింది.

“విక్ర‌మ్ ల్యాండ‌ర్‌ (Vikram lander) కు అమ‌ర్చిన ల్యాండ‌ర్ హ‌జార్డ్ డిటెన్ష‌న్ అండ్ అవైడెన్స్ కెమెరా.. భూమికి క‌నిపించ‌ని మ‌రో వైపు ద‌క్షిణ ధ్రువం వైపు ఉన్న చిత్రాల‌ను తీసింది. చంద్రుడి ఉప‌రిత‌లంపై విక్ర‌మ్ ల్యాండ‌ర్ సుర‌క్షితంగా దిగేందుకు అనువైన ప్ర‌దేశాన్ని క‌నిపెట్టేందుకు ఈ కెమెరా స‌హాయ ప‌డుతుంది. బండ‌రాళ్లు, లోతైన‌ బొంద‌లు లేని ప్రాంతాన్ని ల్యాండ‌ర్ వెతుకుతున్న‌ది” అని ఇస్రో తెలిపింది.

రెండు రోజుల్లో చంద‌మామ‌పై అడుగు పెట్ట‌బోతున్న విక్ర‌మ్ ల్యాండ‌ర్ ప్ర‌స్తుతం జాబిల్లి చుట్టూ ఉన్న 25×134 కిలోమీట‌ర్ల క‌క్ష్య‌లో ప‌రిభ్ర‌మిస్తున్న‌ది. ఈ నెల 23న సాయంత్రం 5.45 నుంచి 6.04 గంట‌ల ప్రాంతంలో విక్ర‌మ్ ల్యాండ‌ర్ జాబిల్లిపై కాలు పెడుతుంద‌ని ఇస్రో ప్ర‌క‌టించింది.