Warangal
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కాంగ్రెస్ హయాంలో రైతులు పడ్డ కష్టాలు మరిచిపోయి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గజినీలా మాట్లాడుతున్నాడని మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో ఏనాడైనా 24 గంటల ఉచిత నిరంతర విద్యుత్ ని ఇచ్చారా ? అంటూ ప్రశ్నించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి రైతు వ్యతిరేకి అన్నారు.
వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదని, మూడు గంటలు కరెంటు ఇస్తే సరిపోతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ దిగజారుడుతానానికి నిదర్శనమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శమని ఆమె కొనియాడారు.
కర్ణాటకలో గెలుపు చూసి తెలంగాణలో రేవంత్ రెడ్డి పగటి కలలు కంటున్నడని ఎద్దేవా చేశారు. రైతు ఎన్ని గంటలు నీరు పారిస్తే ఎన్ని ఎకరాలకు నీరు పారుతుందో రేవంత్ రెడ్డికి కనీస అవగాహన లేదని,
తన వైఖరి మార్చుకోకుంటే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని మంత్రి సత్యవతి హెచ్చరించారు.