HomeLatest newsదారుణం.. ఒకే ట్రక్కులో 40కి పైగా మృతదేహాలు..!

దారుణం.. ఒకే ట్రక్కులో 40కి పైగా మృతదేహాలు..!

అమెరికాలో వలస విషాదం: శాన్‌ ఆంటోనియోలో దారుణ ఘటన

విధాత‌: అమెరికాలో టెక్సాస్‌లోని శాన్‌ ఆంటోనియోలో ఒక కంటైనర్‌ ట్రాలీలో ప్రయాణిస్తున్న 46 మంది మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో 16 మంది ద‌వాఖాన‌ పాల‌య్యారు. వీరంతా వలసదారులని నగర కౌన్సిల్‌ వుమెన్‌ అడ్రియాన రోకా గార్సియా పేర్కొన్నారు. ఈ ఘటన నుంచి బయటపడిన వారి శరీర ఉష్ణోగ్రత కూడా చాలా ఎక్కువగా ఉంది. అధిక ఉష్ణోగ్రత కారణంగా అస్వస్థతకు గురైనట్లు భావిస్తున్నారు.

ఈ ఘటన అక్రమ వలసల మార్గమైన అమెరికా-మెక్సికో సరిహద్దులకు 250 కిలోమీటర్ల దూరంలో ఉంది. శాన్‌ ఆంటోనియో సమీపంలోని ఒక భవనం వద్ద ఓ డ్రైవర్‌ ట్రక్కును వదిలేసి వెళ్లిపోయాడు. సాయంత్రం 6 గంటల సమయంలో అక్కడ పనిచేసే ఓ కార్మికుడికి ట్రక్కు నుంచి ఆర్తనాదాలు వినిపించాయి.

దీంతో అక్కడికి వెళ్లి పరిశీలించిన కార్మికుడికి.. కంటైనర్‌ తలుపు పాక్షికంగా తెరిచి కనిపించింది. అందులో చాలా మంది అచేతనంగా పడిపోయి కనిపించారు. ప్రాణాలతో ఉన్న వారి శరీర ఉష్ణోగ్రతలు కూడా విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి. ఆ ట్రక్కులోని రెఫ్రిజిరేటర్లలో నీరు లేదు, ఎయిర్‌ కండీషన్‌ పని చేయడంలేదు.

మరోపక్క శాన్‌ఆంటోనియోలో సోమవారం 39.4 సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. వీరంతా ఊపిరాడకో.. ఎండ వేడికో ప్రాణాలు కోల్పోయి ఉంటారని అనుమానిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న వెంటనే ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ బృందాలు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. ప్రాణాలతో ఉన్న వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు తరలించారు.

RELATED ARTICLES

తాజా వార్త‌లు

error: Content is protected !!