Home Latest news నాగచైతన్య సమంత నడుమ శోభిత.. అసలేం జరుగుతోంది?

నాగచైతన్య సమంత నడుమ శోభిత.. అసలేం జరుగుతోంది?

విధాత: విడాకులు తీసుకుని ఎవరి లైఫ్ వారు అనుభవిస్తుంటే.. వారిద్దరి మధ్య ఇంకేం జరుగుతుంది. నాగచైతన్య, సమంత ఈ ఇద్దరి పేర్లు కొన్ని నెలల క్రితం లవ్ బర్డ్స్‌కి కేరాఫ్ అడ్రస్‌గా చెప్పబడేవి. మరి ఎవరు దిష్టి పెట్టారో తెలియదుగానీ, సడెన్‌గా ఇద్దరూ విడిపోతున్నామంటూ సోషల్ మీడియాకి ఎక్కారు. కారణాలు ఏంటనేది చెప్పకుండా విడాకులు కూడా తీసేసుకున్నారు.

వారి విడాకుల సమయంలో ఎటువంటి వార్తలు హైలెట్ అయ్యాయో తెలియంది కాదు. బాలీవుడ్‌లో మరో వ్యక్తితో సమంతకు సంబంధాలు ఉన్నాయని ఒకసారి, ఆమె ఎక్స్‌పోజింగ్‌ని అక్కినేని ఫ్యామిలీ తట్టుకోలేక పోతుందని మరోసారి.. ఇలా చై, సామ్‌ల విడాకులకు రకరకాల కారణాలు వినిపించాయి. కానీ అధికారికంగా అసలేం జరిగేంది? అనేది మాత్రం ఇంత వరకు బయటికి రాలేదు.

సరే, ఆ విషయం పక్కన పెడితే.. విడాకులై, ఎవరి జీవితాలు వారు అనుభవిస్తున్నా.. కూడా వారిద్దరూ నిత్యం వార్తలలోనే నిలుస్తున్నారు. ముఖ్యంగా ఒకరంటే ఒకరు ఇంకా మరిచిపోలేకపోతున్నారో.. లేదంటే ఇంకా ఏదైనా కారణం ఉందో తెలియదు కానీ.. సమంతకి సంబంధించి చైతూ, చైతూకి సంబంధించి సమంత.. ఇలా ఏదో ఒక విషయంలో హైలెట్ అవుతూనే ఉన్నారు.

తాజాగా నాగచైతన్య మరో హీరోయిన్‌తో డేటింగ్‌లో ఉన్నారనే వార్తలు రెండు రోజులుగా మీడియా హౌస్‌లలో వైరల్ అవుతున్నాయి. ‘గూఢచారి’, ‘మేజర్’ వంటి చిత్రాలలో నటించిన.. ‘పొన్నియన్ సెల్వన్ 1’ వంటి చిత్రంలో నటిస్తోన్న శోభిత ధూళిపాళతో నాగచైతన్య డేటింగ్ చేస్తున్నట్లుగానూ, త్వరలోనే వారిద్దరూ పెళ్లి కూడా చేసుకునే ఛాన్స్ ఉందనేలా.. వార్తలు వ్యాపిస్తున్న నేపథ్యంలో.. మరోసారి సమంత పేరు సోషల్ మీడియాని షేక్ చేయడం విశేషం.

వేరే అమ్మాయితో నాగచైతన్య డేటింగ్ చేస్తుంటే.. విడాకులు తీసుకున్న సమంతకి సంబంధం ఏముంటుంది? అనేగా డౌటు. సమంతకి సంబంధించిన నెగిటివ్ పబ్లిసిటీని నాగచైతన్య అండ్ బ్యాచ్ చేస్తున్నారని.. సమంత అభిమానులు, అలాగే చైతూకి సంబంధించిన నెగిటివ్ పబ్లిసిటీని సమంత అండ్ టీమ్ చేస్తున్నారని నాగచైతన్య అభిమానులు.. సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు కామెంట్లతో రెచ్చిపోతున్నారు.

ఇప్పుడు వినిపిస్తున్న నాగచైతన్య డేటింగ్ వ్యవహారం కూడా సమంత తరపు వాళ్లు చేయిస్తుందేనని.. చైతూ నేమ్‌, ఫేమ్‌ని దిగజార్చాలనే వారు అలా ప్రయత్నిస్తున్నట్లుగా టాక్ నడుస్తుంటే.. ఇంతకుముందు ముంబైలో సమంత కూడా వేరొకరితో బంధాన్ని ఏర్పరచుకున్నట్లుగా వచ్చిన వార్తలు చైతూకి సంబంధించిన టీమ్ సృష్టించినవే అంటూ.. ఇలా వీరిరువురికి సంబంధించిన అభిమానులు ఆరోపణలు చేసుకుంటున్నారు. దీంతో వీరి వ్యవహారం మరోసారి రచ్చకెక్కింది.

ఇక ప్రస్తుతం నాగచైతన్య విషయంలో వినిపిస్తున్న వార్తలలో సారాంశం ఏమిటంటే.. హైదరాబాద్‌, జూబ్లీహిల్స్‌లో నాగచైతన్య కొత్తగా నిర్మిస్తున్న ఇంటికి ఒకే కారులో చైతూ, శోభిత ధూళిపాళ వచ్చి వెళుతున్నారట. అలాగే ‘మేజర్’ చిత్ర షూటింగ్ టైమ్‌లో శోభిత ఉన్న ప్రదేశానికి.. చైతూ పలుమార్లు వెళ్లినట్లుగా ఆరోపణలు వచ్చాయి.

దీంతో వారిద్దరి మధ్య ఉన్నది.. స్నేహబంధమో.. లేదంటే ఇంకాస్త ముందుకే వెళ్లారో అంటూనే.. ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారనేలా వార్తలు బయటికి వచ్చాయి. ఈ వార్తలు సమంతనే కావాలని పుట్టించినట్లుగా కొందరు కామెంట్స్ చేయడంతో.. ఆ కామెంట్లపై సమంత ఫైర్ అవుతూ ట్వీట్ కూడా చేసింది.

‘ఒక అమ్మాయి మీద గాసిప్స్ వస్తే .. నిజమే కావచ్చు అనుకుంటారు.. అదే.. అబ్బాయి మీద వదంతులు వస్తే ఒక అమ్మాయి కావాలని చేయించింది అంటారు.. ఇంకెన్ని రోజులు ఇలాగే ఉంటారు గైస్‌.. అప్‌డేట్ అవండి’ అంటూ.. సమంత ఇచ్చిన రిప్లయ్‌తో మంగళవారం అంతా సోషల్ మీడియాలో సమంత, చైతూలపై హాట్‌హాట్‌గా చర్చలు నడిచాయి.

ఇదీ చై, సామ్‌ల తాజా విషయం. మొత్తంగా చూస్తే.. వీరిద్దరిపై ఎన్నో కళ్లు నిఘా ఉన్నాయనేది మాత్రం ఇక్కడ క్లియర్‌గా తెలిసిపోతుంది. సో.. ఇకపై వారు వేసే ప్రతి అడుగూ.. చాలా జాగ్రత్తగా వేయాలనేది.. వారికి ఈ పాటికే అర్థమై ఉంటుంది. ఈ ఒత్తిడిలో ముందు ముందు ఈ ఇద్దరి దారి ఎలా ఉంటుందో వేచి చూడాలి.

RELATED ARTICLES

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల నుంచి నగదు మాయం

విధాత : ఏపీలోని వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లోంచి నగదు మాయమైన ఘటన సంచలనం సృష్టిస్తోంది. మొత్తం 90 వేల మంది ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లోని రూ.800 కోట్లు విత్...

ఈ వారం థియేటర్లలో, ఓటీటీల్లో వచ్చే సినిమాలివే

విధాత‌: ఈ వారం థియేటర్లలో వద్ద సినిమాల సందడి కాస్త తగ్గనుంది. ఈ వారం మళయాళ అగ్ర నటుడు పృథ్వీరాజ్‌ నటించిన బహుబాషా చిత్రం కడువ తప్పితే పెద్దగా పేరున్న చిత్రాలేవి విడుదల...

భువనగిరి: వక్ఫ్ భూముల్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేత

విధాత,యాదాద్రి భువనగిరి: భువనగిరి పట్టణంలోని సింగన్నగూడెంలో ఉన్న వక్ఫ్ బోర్డు భూమిలో ఉన్న అక్రమ నిర్మాణాలను అధికారులు మంగళవారం కూల్చివేశారు. సర్వే నెంబర్ 797.798.621లో 4ఎకరాలు వక్ఫ్ భూమిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని...

Alert.. అవసరమైతే తప్పా బయటకు రావొద్దు: GHMC

విధాత‌, హైదరాబాద్: ఇవాళ మధ్యాహ్నం నుంచి కురుస్తున్న మోస్తరు వర్షాలతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. అల్వాల్ సర్కిల్ పరిధిలో దాదాపు గంటన్నర సేపు వర్షం కుర‌వ‌డంతో రహదారులు వర్షపు నీటితో...

మెరుగైన వైద్య సేవల్లో ఎయిమ్స్ ముందంజ: గవర్నర్ తమిళి సై

విధాత, యాదాద్రి భువనగిరి: గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఎయిమ్స్ వైద్య సంస్థలు దేశంలోనే ముందంజలో ఉన్నాయని రాష్ట్ర గవర్నర్ తమిళ్ సై సౌందర్ రాజన్ అన్నారు. మంగళవారం ఆమె...

ఆలోచనతో రండి.. ఆవిష్కరణలతో వెళ్లండి: టీ హ‌బ్ 2ను ప్రారంభించిన CM KCR

విధాత‌, హైద‌రాబాద్: ‘ఆలోచనతో రండి – ఆవిష్కరణలతో వెళ్లండి’’ అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ లోని మాదాపూర్-రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్, ‘టీ...

తాజా వార్త‌లు

తెలంగాణ ప్రభుత్వం అంటే నాకు చాలా ఇష్టం: AR రెహమాన్

విధాత: తెలంగాణ ప్రభుత్వం ఐటీ హబ్ హైదరాబాద్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన టీ-హబ్ ఫేజ్2 భవనాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ముఖ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ ముఖ్య...

Breaking: జూన్ 30న ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు

విధాత‌, హైదరాబాద్: తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు జూన్ 30న విడుదల చేయనున్నారు. ఈ మేర‌కు ఎస్సెస్సీ బోర్డు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం ఉద‌యం 11:30 గంట‌ల‌కు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి...

ఇది రైతు బిడ్డ పరిపాలిస్తున్న ప్రభుత్వం: మంత్రి హ‌రీశ్‌రావు

విధాత, హైద‌రాబాద్ : రాష్ట్రంలో రైతు బంధు సంబరం మొద‌లైంద‌ని త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. తొలి రోజున ఒక ఎక‌రం వ‌ర‌కు భూమి క‌లిగిన 19,98,285 మంది రైతుల ఖాతాల్లో రూ. 586.66...

ఇంటర్‌లో అవిభక్త కవల‌లు వీణ, వాణిల అద్భుత ప్ర‌తిభ‌

విధాత‌, హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలు ఈ రోజు విడుదలైన సంగతి తెలిసిందే. ఫలితాల్లో అవిభక్త కవలలైన వీణ-వాణిలు ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫస్ట్ క్లాస్ మార్కులతో...