పెళ్లి వేడుక‌లో ర‌స‌గుల్ల కోసం వివాదం జ‌రిగింది. ఈ వివాదం కార‌ణంగా ఆరుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని శంషాబాద్‌లో ఆదివారం అర్ధ‌రాత్రి చోటు చేసుకుంది.

ల‌క్నో: ఓ పెళ్లి వేడుక‌లో ర‌స‌గుల్ల కోసం వివాదం జ‌రిగింది. ఈ వివాదం కార‌ణంగా ఆరుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని శంషాబాద్‌లో ఆదివారం అర్ధ‌రాత్రి చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. శంషాబాద్ ఏరియాలోని ఓ ఫంక్ష‌న్ హాల్‌లో ఆదివారం రాత్రి ఓ వివాహ వేడుక జ‌రిగింది. ఇక డిన్న‌ర్ చేస్తున్న క్ర‌మంలో ర‌స‌గుల్ల అయిపోయింద‌ని ఒక‌రు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

దీంతో ఇరు వ‌ర్గాల మ‌ధ్య తీవ్ర వాగ్వాదం జ‌రిగింది. దాడుల‌కు తెగ‌బ‌డ్డారు. ఆరుగురికి తీవ్ర గాయాల‌య్యాయి. అనంత‌రం వారిని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం బాధితుల ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని వైద్యులు పేర్కొన్నారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Updated On
Somu

Somu

Next Story