ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ యోజన కింద రైతులకు ఏటా అందిస్తున్న 6వేల సహాయాన్ని 12వేలకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది

విధాత: ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ యోజన కింద రైతులకు ఏటా అందిస్తున్న 6వేల సహాయాన్ని 12వేలకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్ హనుమాన్ ఘడ్ ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ కిసాన్ సమ్మాన్ నిధి యోజనను 6వేల నుంచి 12వేలకు పెంచనున్నట్లుగా ప్రకటించారు.

ఇది దేశంలోని రైతులకు శుభవార్తగా ఆయన అభివర్ణించారు. రైతుల నుండి ఎంఎస్పీ మేరకు పంటలను కొనుగోలు చేయాలని రాజస్థాన్ బీజేపీ నిర్ణయించిందన్నారు. అలాగే తమ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు బోనస్ కూడా ఇస్తామని ప్రధాని మోడీ తెలిపారు. రాష్ట్రంలోని ఇంధన ధరలు సమీక్షిస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు.

Updated On
Somu

Somu

Next Story