
- అధికారంలోకి వచ్చిన వెంటనే కులగణన
- రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో రాహుల్
జయపూర్ : దేశంలో కులగణన ఎక్స్-రే లాంటిందని అది నీల్లను- పాలను వేరు చేస్తుందని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. మంగళవారం రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార బహిరంగ సభలో రాహుల్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచిన వెంటనే కులగణన నిర్వహిస్తామని ప్రకటించారు. కులగణన అవసరం రాజస్థాన్‌లో చాలా ఉందన్నారు. అందరికీ అన్నిటిలో భాగస్వామ్యం ఉండాలన్నా, అధికారాలు ,హక్కులు మనకు చెందాలన్నా ఎవరు ఏ జాతికి ,ఏ సమాజానికి చెందిన వాళ్ళు అనేది తప్పకుండా తేల్చాల్సిందేనన్నారు. కులగణన ప్రాముఖ్యతను రాహుల్ వివరించారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే దేశవ్యాప్తంగా కులగణన చేపడతామన్నారు. కులగణన ద్వారా ఎవరికి ఏ అధికారాలు ఉండాలి, సమాజంలో ఎవరు ఏ స్థాయిలోఅభివృద్ధి చెందారు, చెందాల్సిన వారు ఎవరనే విషయాలు తేలిపోతాయన్నారు. హక్కులు ,అధికారాలు, భాగస్వామ్యం లో ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలంటే తప్పకుండా కులగణన చేయాల్సిందేనన్నారు.
జల్.. జమీన్.. జంగల్ పై ఆదివాసులదే అధికారంఅని రాహుల్ అన్నారు కాంగ్రెస్ పార్టీ ఆఖరి వరకు ఆదివాసుల అధికారాలను రక్షించడానికి పాటుపడుతుందన్నారు. ఎంతవరకైతే కాంగ్రెస్ పార్టీ ఉంటుందో అప్పటివరకు ఆదివాసుల అధికారాలని తప్పక రక్షిస్తుందని తెలిపారు. ఆదివాసులతో నిలబడి వారి పిల్లలకు ఉచిత విద్యను అందిస్తుందన్నారు.
