• చ‌త్తీస్‌ఘ‌డ్ పోలీసుల‌ను ఆదేశించిన సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ: ఝీరం ఘ‌ట‌న‌పై చ‌త్తీస్‌ఘ‌డ్ పోలీసులు విచార‌ణ చేయ‌డానికి సుప్రీం కోర్టు అనుమ‌తి ఇచ్చింది. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు బీజేపీపై కాంగ్రెస్ సాధించిన విజ‌యంగా రాజ‌కీయ ప‌రిశీల‌కులు అభివ‌ర్ణిస్తున్నారు. ఈ తీర్పు ఎన్ఐఏ(నేషనల్ ఇన్వేస్టిగేషన్ ఏజన్సీ) కు తగిలిన గట్టి దెబ్బగా భావిస్తున్నారు. ఎన్నిక‌ల సంద‌ర్భంగా నాటి కాంగ్రెస్ నాయ‌కులు 2013 మే 25 న‌ బస్తర్ లో పరివర్తన ర్యాలీ నిర్వ‌హించి తిరిగి వస్తుండగా సుకుమా జిల్లా ఝీరం ఘాట్‌లో వారి వాహనాలపై మావోయిస్టులు దాడి చేశారు. ఈ ఘ‌ట‌న‌లో చత్తీస్ ఘఢ్ రాష్ట్ర‌ కాంగ్రెస్ నాయ‌కులు మహేంద్ర కర్మ, నందకుమార్ పటేల్ ఆయన కుమారుడు దినేష్ పటేల్, మాజీ కేంద్రమంత్రి విద్యాచరణ్ శుక్లా, రాజ్ నంద్ గాం, ఉదయ్ ముదలియార్ ల‌తో సహా ప‌లువురు నాయకులు, పోలీసులతో పాటు మొత్తం 32 మంది మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే. ఈ సంఘ‌ట‌న‌పై ఆనాడు యావ‌త్ ప్ర‌పంచ‌మే నివ్వెర‌పోయింది.


అయితే ఆ నాడు రాష్ట్రం లో అధికారం లో వున్న బీజేపీనే నక్సలైట్ల తో కుమ్మక్కై పథకం ప్రకారం ఈ దాడి చేయించిందని ఆరోపణలు వెలువ‌డ్డాయి. అప్పటి యూపీఏ ప్రభుత్వం ఎన్ఐఏ ను విచార‌ణ‌కు ఆదేశించింది. దాదాపు పది సంవత్సరాలు సుధీర్ఘంగా విచారించిన ఎన్ ఐఏ ఈ దాడి లో రాజకీయ కుట్ర లేదని నివేదించింది. అలాగే బీజేపీ ప్ర‌భుత్వం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి తో వేసిన క‌మిటీ కూడా బీజేపీకికి క్లీన్ చిట్ ఇచ్చింది.

ఈ రెండింటి నివేదికలపై కాంగ్రెస్‌ అనుమానాలను వ్యక్తంచేసింది. 2018 లో ఏర్పడిన కాంగ్రెస్ సర్కారు చత్తీస్ ఘఢ్ పోలీసుల ద్వారానే విడిగా విచారణ జరిపించాల‌ని నిర్ణయించి, హైకోర్టులో అఫీల్ చేసింది. విడిగా విచారణ చేయాల్సిన అవసరం లేదని అప్పీల్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఛత్తీస్ ఘఢ్ కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్ర‌యించింది. విచారించిన సుప్రీం కోర్టు చ‌త్తీస్ ఘ‌డ్ పోలీసులు విచార‌ణ చేయ‌డానికి అనుమ‌తి ఇస్తూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు చ‌త్తీస్ ఘ‌డ్ కాంగ్రెస్ పార్టీ హ‌ర్షం వ్య‌క్తం చేసింది.

Updated On
Subbu

Subbu

Next Story