ఆర్థిక రాజ‌ధాని ముంబైలో సూట్‌కేస్‌లో మ‌హిళ మృత‌దేహం ల‌భించ‌డం క‌ల‌క‌లం సృష్టించింది. ప‌ట్ట‌ప‌గ‌లు, జ‌నం ర‌ద్దీగా ఉండే ప్రాంతంలో సూట్‌కేసులో యువ‌తి మృత‌దేహాన్నిగుర్తించారు

  • సెంట్రల్ ముంబైలోని కుర్లా మెట్రో
  • రైల్వే నిర్మాణ సైట్ సమీపంలో గుర్తింపు

విధాత‌: ఆర్థిక రాజ‌ధాని ముంబైలో సూట్‌కేస్‌లో మ‌హిళ మృత‌దేహం ల‌భించ‌డం క‌ల‌క‌లం సృష్టించింది. ప‌ట్ట‌ప‌గ‌లు, జ‌నం ర‌ద్దీగా ఉండే ప్రాంతంలో సూట్‌కేసులో యువ‌తి మృత‌దేహాన్నిగుర్తించారు. సెంట్రల్ ముంబైలోని కుర్లాలో మెట్రో రైల్వే నిర్మాణ సైట్ సమీపంలో సూట్‌కేస్‌లో ఒక మహిళ మృతదేహం లభ్యమైందని పోలీసులు తెలిపారు.

శాంతినగర్‌లోని సీఎస్‌టీ రోడ్‌లో పడి ఉన్న సూట్‌కేస్ గురించి సోమ‌వారం ముంబై పోలీసులకు స్థానికులు స‌మాచారం అందించారు. పోలీసులు మధ్యాహ్నం 12:30 గంటలకు సూట్‌కేసును తెరిచిచూడ‌గా అందులో మ‌హిళ మృతదేహం ఉన్న‌ది. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఘాట్‌కోపర్‌లోని రాజావాడి ద‌వాఖాన‌కు తరలించారు. మహిళ ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉన్న‌ద‌ని పోలీసులు తెలిపారు.

మృతురాలి వ‌య‌స్సు 25-30 ఏండ్ల మ‌ధ్య వ‌య‌స్సు ఉంటుంద‌ని పోలీసులు పేర్కొన్నారు. మృతురాలు టీష‌ర్ట్‌, ట్రాక్ పాయింట్ ధ‌రించిన‌ట్టు పేర్కొన్నారు. పోలీసులు స‌మీపంలోని సీసీటీవీ పుటేజీల‌ను ప‌రిశీలిస్తున్నారు. వివిధ సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు.

Updated On
Somu

Somu

Next Story