విద్యాశాఖ క్లారిటీ విధాత: తెలంగాణ స్కూళ్లకు దసరా సెలవుల్లో కోత విధించాలని SCERT చేసిన ప్రతిపాదనలను తెలంగాణ విద్యాశాఖ తిరస్కరించింది. దసరా సెలవుల్లో ఎలాంటి మార్పు లేదని, ఈ నెల 26 నుంచి అక్టోబర్ 9వ తేదీ వరకు సెలవులు ఉంటాయని స్పష్టం చేసింది. అక్టోబర్ 10న తిరిగి పాఠశాలలు ప్రారంభమవుతాయని తెలిపింది. జూలైలో భారీ వర్షాల కారణంగా పాఠశాలలకు అదనపు సెలవులు ఇచ్చినందున, పాఠ్యప్రణాళిక సక్రమంగా సాగేందుకు దసరా సెలవుల్లో కోత విధించాలని విద్యాశాఖకు ఎస్సీఈ […]

విద్యాశాఖ క్లారిటీ
విధాత: తెలంగాణ స్కూళ్లకు దసరా సెలవుల్లో కోత విధించాలని SCERT చేసిన ప్రతిపాదనలను తెలంగాణ విద్యాశాఖ తిరస్కరించింది. దసరా సెలవుల్లో ఎలాంటి మార్పు లేదని, ఈ నెల 26 నుంచి అక్టోబర్ 9వ తేదీ వరకు సెలవులు ఉంటాయని స్పష్టం చేసింది.
అక్టోబర్ 10న తిరిగి పాఠశాలలు ప్రారంభమవుతాయని తెలిపింది. జూలైలో భారీ వర్షాల కారణంగా పాఠశాలలకు అదనపు సెలవులు ఇచ్చినందున, పాఠ్యప్రణాళిక సక్రమంగా సాగేందుకు దసరా సెలవుల్లో కోత విధించాలని విద్యాశాఖకు ఎస్సీఈ ఆర్టీ సిఫారసు చేసింది.

