టీకా వేయించుకున్నా.. ఇంకేం కాదులే !’ అని జనం విచ్చలవిడిగా తిరిగితే ఏమవుతుందో అనే దానికి చిలీ దేశం చక్కటి ఉదాహరణ. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక శాతం ప్రజలకు టీకాలు ఇచ్చిన తొలి ఐదు దేశాల్లో చిలీది మూడో స్థానం. ఈ అంకెను చూసి సంబరపడాల్సిన అవసరం లేదు.. ఇక్కడ టీకాలు ఇవ్వడం ప్రారంభించినప్పటి నుంచి విచిత్రంగా కేసుల సంఖ్య భారీగా పెరుగుతూ వస్తోంది. దీనికి కారణాలను అన్వేషించిన పరిశోధకులకు ఓ విషయం తెలిసింది. అదే ప్రజల స్వయంకృతం.. నిర్లక్ష్యం..! వాస్తవానికి కరోనాపై పోరులో టీకాలేమీ రామబాణాలు […]

టీకా వేయించుకున్నా.. ఇంకేం కాదులే !’ అని జనం విచ్చలవిడిగా తిరిగితే ఏమవుతుందో అనే దానికి చిలీ దేశం చక్కటి ఉదాహరణ. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక శాతం ప్రజలకు టీకాలు ఇచ్చిన తొలి ఐదు దేశాల్లో చిలీది మూడో స్థానం. ఈ అంకెను చూసి సంబరపడాల్సిన అవసరం లేదు.. ఇక్కడ టీకాలు ఇవ్వడం ప్రారంభించినప్పటి నుంచి విచిత్రంగా కేసుల సంఖ్య భారీగా పెరుగుతూ వస్తోంది. దీనికి కారణాలను అన్వేషించిన పరిశోధకులకు ఓ విషయం తెలిసింది. అదే ప్రజల స్వయంకృతం.. నిర్లక్ష్యం..!

వాస్తవానికి కరోనాపై పోరులో టీకాలేమీ రామబాణాలు కాదని వైద్యులు నెత్తీనోరు బాదుకొని చెబుతున్నారు. టీకాలు తీసుకొన్నా ఇన్ఫెక్షన్‌ రాకుండా ఆపలేమని.. కేవలం ఇన్ఫెక్షన్‌ నుంచి వచ్చే దుష్పరిణామాలను గణనీయంగా తగ్గించవచ్చని పేర్కొంటున్నారు. టీకాలు.. మాస్కులు.. శానిటైజర్లు.. భౌతిక దూరం వంటివి ఓ ప్యాకేజీలా అమలు చేసి మాత్రమే వైరస్‌ను జయించవచ్చని పేర్కొంటున్నారు. చిలీలో మాత్రం ప్రజలు చాలా నిర్లక్ష్యపు పనులను కట్టకట్టుకొని ఒకేసారి చేయడంతో ఆ ఫలితం అనుభవిస్తున్నారు.

నవంబర్‌లో కేసులు తగ్గగానే ప్రజలు నిబంధనలను గాలికొదిలేయడం మొదలుపెట్టారు. క్రిస్మస్‌ సీజన్‌లో షాపింగ్‌ మాల్స్‌కు ఎగబడ్డారు. పర్యాటక స్థలాలు రద్దీగా మారాయి. విదేశీ యాత్రలకు వెళ్లిన వారు ఇతర కరోనా రకాలను అంటించుకొని దేశానికి తిరిగొచ్చారు. ఫలితంగా జనవరి మొదటి నుంచి కేసుల గ్రాఫ్‌ క్రమంగా పెరుగుతూ వచ్చింది. పరీక్షలు చేయించుకోవడంలో కూడా నిర్లక్ష్యం వహించారు. ఫలితంగా దేశం మొత్తం వైరస్‌ పాకిపోయింది.

చీలి దేశం మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కంటే పెద్దగా ఉంటుంది కాని జనాభా కేవలం రెండు కోట్లు.

‘చిలీ’ అంటే స్థానిక ఆదిమ జాతి మాపుచి భాషలో ‘భూమి అంతమయ్యే ప్రదేశమని’.. ఇప్పుడు అక్కడి ప్రభుత్వ, ప్రజల నిర్లక్ష్యంతో కరోనా వాక్సినేషన్‌పై ఆశలు అంతమయ్యే ప్రదేశంగా మారింది.

Updated On 20 April 2021 5:02 AM GMT
subbareddy

subbareddy

Next Story