మేష రాశి: పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఇష్టమైన వ్యక్తులను కలుసుకుంటారు. అధ్యాపక వృత్తిలో ఉన్న వారికి మనోల్లాసం లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు సానుకూల దిశలో వుంటాయి. ధనప్రాప్తి కలుగుతుంది. వృషభ రాశి: నిద్రా సౌఖ్యం తక్కువగా వుంటుంది. గతంలో చేసిన పొరపాట్లు అశాంతిని కలిగిస్తాయి. ఇతరుల సహాయం కోరవలసి వస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో చీకాకులు కలుగుతాయి. ధన వ్యయము పెరుగుతుంది. మిథున రాశి: చేసిన పనులనే మళ్ళీ మళ్ళీ చేయవలసి వస్తుంది. ప్రయాణ మూలక లాభములుంటాయి. బహుమానములు […]

మేష రాశి: పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఇష్టమైన వ్యక్తులను కలుసుకుంటారు. అధ్యాపక వృత్తిలో ఉన్న వారికి మనోల్లాసం లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు సానుకూల దిశలో వుంటాయి. ధనప్రాప్తి కలుగుతుంది.

వృషభ రాశి: నిద్రా సౌఖ్యం తక్కువగా వుంటుంది. గతంలో చేసిన పొరపాట్లు అశాంతిని కలిగిస్తాయి. ఇతరుల సహాయం కోరవలసి వస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో చీకాకులు కలుగుతాయి. ధన వ్యయము పెరుగుతుంది.

మిథున రాశి: చేసిన పనులనే మళ్ళీ మళ్ళీ చేయవలసి వస్తుంది. ప్రయాణ మూలక లాభములుంటాయి. బహుమానములు లభిస్తాయి. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. నష్ట పోయిన ధనము కొంత తిరిగి లభిస్తుంది.

కర్కాటక రాశి: ఆకస్మిక ప్రమాదములు కలుగవచ్చును. దుష్ప్రవర్తన కలిగివుందురు. అధికారుల మూలక భయం ఏర్పడవచ్చును. అవమానములు ఎదురౌతాయి. ధన వ్యయము కలుగుతుంది.

సింహ రాశి: మంచి వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. వ్యాపారస్థులు కొత్త‌ పెట్టుబడులు పెట్టు అవకాశము కలుగుతుంది. భయం భయంగానే అనుకున్న పనులన్నింటినీ పూర్తి చేస్తారు. శుభకార్యాచరణముంటుంది.

కన్యా రాశి: చిరకాల వాంఛలను సాకారం చేసుకుంటారు. పరోపకారముచే గౌరవ మర్యాదలు లభిస్తాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. విశేష ధన ప్రాప్తి కలుగుతుంది.

తులా రాశి: శ్రమాధిక్యత వుంటుంది. కుటుంబ సభ్యులపై అపవాదులమూలకంగా అశాంతి కలుగుతుంది. కపట స్వభావుల మాయలో పడకుండా జాగ్రత్తగా వుండండి. శరీర బలహీనత కలుగవచ్చును.

వృశ్చిక రాశి: చోరబాధలు కలుగవచ్చును. ఉదర సంబంధమైన బాధలు కలుగవచ్చును. ఇష్టానికి వ్యతిరేకంగా పనిచేయవలసి వస్తుంది. కోపం ఎక్కువగా ప్రదర్శిస్తారు. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి.

ధనుస్సు రాశి: పుణ్యక్షేత్ర సందర్శనం సంతోషాన్నిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు అనుకోని విధంగా సత్ఫలితాలనిస్తాయి. పరోపకారము యందు ఆసక్తి కలిగివుంటారు.

మకర రాశి: స్థిరాస్థి మూలక లాభాలుంటాయి. మీ అంచనాలు నిజమౌతాయి. స‌రియైన సలహాలతో బంధుమిత్రులకు సహాయపడతారు. విద్యార్థులు నూతన విషయాలను తెలుసుకుంటారు. ధన ప్రాప్తి కలుగుతుంది.

కుంభ రాశి: కుటుంబ మూలక సౌఖ్యముంటుంది. శుభకార్యాచరణకై సంప్రదింపులు చేస్తారు. ఊహించని విధంగా కీర్తి, ప్రతిష్ఠలు లభిస్తాయి. శరీర సౌఖ్యము ఉల్లాసాన్నిస్తుంది. స్వల్ప ధనలాభము కలుగవచ్చును.

మీన రాశి: అనారోగ్యమూలకంగా అశాంతి కలుగవచ్చును. వృత్తి, ఉద్యోగాలలో చిక్కులు ఏర్పడతాయి. అవమానములెదురౌతాయి. ప్రయాణముల వలన అసౌకర్యం కలుగుతుంది. ధనవ్యయము ఎక్కువౌతుంది.

- తూండ్ల కమలాకర శర్మ సిద్ధాంతి, కూకట్‌పల్లి, హైదరాబాద్, +91 99490 11332.

Updated On 2 March 2023 6:44 AM GMT
krs

krs

Next Story