విధాత: పోలీస్ ఉద్యోగ నియామకాలకు నిర్వహించిన ఫిజికల్ టెస్టులు పూర్తయ్యాయి. డిసెంబర్ 8వ తేదీ నుంచి ప్రారంభమైన పరీక్షలు గురువారంతో ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా 2.07 లక్షల మందికి గాను 1.11 లక్షల మంది (53.07 శాతం) అర్హత సాధించినట్లు పోలీస్ నియామక బోర్డు ఛైర్మన్ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు.
మార్చి 2వ వారం నుంచి ఏప్రిల్ 3వ వారం వరకు మెయిన్స్ రాత పరీక్షలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఎస్సై పోస్టులకు 52,786 మంది, కానిస్టేబుల్ పోస్టులకు 90,488 మంది, ఆబ్కారీ కానిస్టేబుల్ పోస్టులకు 59,325 మంది తుది రాత పరీక్షకు పోటీ పడనున్నారు.