Maharashtra ఒక‌రు మృతి, ప‌లువురికి గాయాలు సోష‌ల్ మీడియాలో వివాదాస్ప‌ద పోస్టు రెండు వ‌ర్గాల మ‌ధ్య చెల‌రేగిన ఘ‌ర్ష‌ణ‌లు జిల్లాలో ఇంట‌ర్ నెట్ సేవ‌లు బంద్‌ విధాత‌: మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని ఖటావ్ తాలూకాలో ఆదివారం రాత్రి మ‌త ఘ‌ర్ష‌ణ‌లు చెల‌రేగాయి. ఈ అల్ల‌ర్ల‌లో ఒక‌రు చ‌నిపోగా, ముగ్గురు గాయ‌ప‌డ్డారు. మ‌రికొంద‌రు ద‌వాఖాన‌లో చికిత్స పొందుతున్నారు. అభ్యంతరకరమైన సోషల్ మీడియా పోస్టులు మ‌త ఘ‌ర్ష‌ణ‌ల‌కు దారి తీశాయ‌ని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ప్ర‌స్తుతం ప‌రిస్థితి అదుపులోనే […]

Maharashtra

  • ఒక‌రు మృతి, ప‌లువురికి గాయాలు
  • సోష‌ల్ మీడియాలో వివాదాస్ప‌ద పోస్టు
  • రెండు వ‌ర్గాల మ‌ధ్య చెల‌రేగిన ఘ‌ర్ష‌ణ‌లు
  • జిల్లాలో ఇంట‌ర్ నెట్ సేవ‌లు బంద్‌

విధాత‌: మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని ఖటావ్ తాలూకాలో ఆదివారం రాత్రి మ‌త ఘ‌ర్ష‌ణ‌లు చెల‌రేగాయి. ఈ అల్ల‌ర్ల‌లో ఒక‌రు చ‌నిపోగా, ముగ్గురు గాయ‌ప‌డ్డారు. మ‌రికొంద‌రు ద‌వాఖాన‌లో చికిత్స పొందుతున్నారు. అభ్యంతరకరమైన సోషల్ మీడియా పోస్టులు మ‌త ఘ‌ర్ష‌ణ‌ల‌కు దారి తీశాయ‌ని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ప్ర‌స్తుతం ప‌రిస్థితి అదుపులోనే ఉన్న‌ద‌ని పేర్కొన్నారు.

సతారా జిల్లా యంత్రాంగం ముందుజాగ్రత్త చర్యగా ఈ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్లు, పూణేకు 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న పూసేవలి గ్రామంలో ఘర్షణలు చోటుచేసుకున్న‌ట్టు అధికారులు వెల్ల‌డించారు.

“ఆ ప్రాంతంలోని ఒక నిర్దిష్ట వర్గానికి చెందిన కొంద‌రు యువకులు సోషల్ మీడియా పెట్టిన పోస్టుల కార‌ణంగా ఆదివారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఘర్షణలు చెల‌రేగిన‌ట్టు ప్రాథమిక విచారణలో తేలింది. ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అనేక ఇండ్లకు నిప్పు పెట్టారు” అని సతారా జిల్లా పోలీసు సీనియర్ అధికారి తెలిపారు. పోలీసు బలగాలను మోహరించామ‌ని, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామ‌ని వెల్ల‌డించారు.

సతారా జిల్లాలో ఉద్రిక్తతల నేపథ్యంలో, ఎలాంటి వదంతులను నమ్మవద్దని జిల్లా పౌరులకు సతారా జిల్లా కలెక్టర్ జితేంద్ర దూది విజ్ఞప్తి చేశారు. మతపరమైన విభేదాలకు దారితీసే, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఎలాంటి అంశాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయ‌వ‌ద్ద‌ని సూచించారు.

Updated On 12 Sep 2023 5:51 AM GMT
somu

somu

Next Story