HomelatestMLA Peddi Sudarshan Reddy | పాకాల కింద.. వందశాతం యాసంగి సాగు: ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి

MLA Peddi Sudarshan Reddy | పాకాల కింద.. వందశాతం యాసంగి సాగు: ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి

  • దశాబ్దాల చరిత్రలో తొలిసారి
  • 30వేల ఎకరాల్లో వరి సాగు
  • కేంద్రం ధాన్యం మద్దతు ధర పెంచాలి
  • నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ జిల్లా పాకాల సరస్సు కింద గతానికి భిన్నంగా యాసంగిలో 100% ఆయకట్టులో పంటల సాగు పరిపూర్తి అయ్యిందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (MLA Peddi Sudarshan Reddy) ఆనందం వ్యక్తం చేశారు. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ చెరువు కింద తొలిసారి పూర్తి ఆయకట్టు సాగు కావడం పట్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు ఆయకట్టు కింద 30 వేల ఎకరాలలో వరి సాగు జరిగిందని చెప్పారు.

ఖానాపూర్ మండల కేంద్రంలోని PACS ఆధ్వర్యంలో వడ్ల & మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ధాన్యం మద్దతు ధర పెంచి పంట ఉత్పత్తులను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పెద్ద మొత్తంలో ఆయకట్టు సాగయేందుకు సహకరించిన మండల ప్రజాప్రతినిధులకు, రైతులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

గోదావరి నీటి వల్ల సాధ్యం

గోదావరి నది జలాలను పాకాలకు మళ్ళించడంతో ధాన్యం దిగుబడి పెరిగిందన్నారు.
రాబోయే కాలంలో ప్రతి ఏటా 100% విస్తీర్ణంతో పాకాల ఎండాకాలం పంటలు పండిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాగునీటికి, వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు.

నర్సంపేటకు ఆత్యంత ప్రతిష్టాత్మకమైన రామప్ప-పాకాల, రామప్ప-రంగాయ చెరువు ప్రాజెక్టుల ద్వారా నియోజకవర్గంలో వరి, మక్కల సాగు విస్తీర్ణం పెరిగి అధిక దిగుబడిని సాధించామని చెప్పారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడం వల్ల కాలువల ద్వారా నియోజకవర్గంలో రెండవ పంటకు సాగు నీరు అందించడంతో సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. భవిష్యత్తులో నర్సంపేట నియోజకవర్గంలో రెండు పంటలకు సాగు నీరు అందిస్తామని హామీఇచ్చారు.

రైతులు స్టేట్ షెడ్యూల్ ప్రకారం వ్యవసాయ అధికారులు సూచన మేరకు పంటలను త్వరగా సాగు చేసుకోవాలని సూచించారు. ఆలస్యం అయినచో వడగండ్ల వర్షానికి పంట నష్టం గురయ్యే అవకాశాలు ఉన్నాయని రైతులకు విజ్ఞప్తి చేశారు.

కేంద్ర ప్రభుత్వం రైతులు పండించిన అన్ని పంటలకు మద్దతు ధరను పెంచాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ODCMS చైర్మన్ స్వామి నాయక్, ఎంపిపి, జెడ్పిటిసి, ఎంపిటిసి, సర్పంచ్, RSS కన్వీనర్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular