Wednesday, March 29, 2023
More
    Homelatest1000 కోట్ల‌ ఆస్తి ఉన్నా.. తారకరత్నకు తండ్రి చిల్లిగవ్వ కూడా ఇవ్వలే

    1000 కోట్ల‌ ఆస్తి ఉన్నా.. తారకరత్నకు తండ్రి చిల్లిగవ్వ కూడా ఇవ్వలే

    విధాత‌, సిన‌మా: నందమూరి తారకరత్న తన జీవితంలో ఎన్నో చేదు అనుభవాలు ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా ఆయన ఎన్నో ఆర్థిక కష్టాలు ఎదుర్కొన్నాడు. ఎన్టీరామారావు మనవడైన నందమూరి తార‌క‌ర‌త్న ఆర్థిక కష్టాలు ఎదుర్కోవడం ఏమిటని అనుమానపడే వాళ్ళు కొందరు ఉంటారు. ఆయన తండ్రికి.. ఆయ‌న తాత ఎన్టీఆర్ ఇచ్చిన ఆస్థి విలువ ఏకంగా వేయి కోట్ల పైగానే ఉంటుంది.

    కానీ. ప్రపంచంలో ఏ కొడుకు పైనా తండ్రి ఇంత కఠినంగా వ్యవహరించడం ఎవరు చూసి ఉండరు. ఓ తండ్రి తన కుమారునిపై కఠినంగా వ్యవహరించి పంతానికి పోయి ఆస్థిని పంచి పెట్టకపోవడం ఎక్కడా చూసి ఉండం. వేలకోట్ల ఆస్తి ఉన్నప్పటికీ తార‌క‌ర‌త్న దగ్గర అనుభవించ‌డానికి చిల్లి గ‌వ్వ‌లేదు.

    మొదటి సినిమా ‘ఒకటో నెంబర్ కుర్రాడు’ ప్రారంభమైన రోజే తొమ్మిది సినిమాలు సంతకం చేశాడు. అందులో ఐదు సినిమాలు మాత్రమే విడుదలయ్యాయి. మిగిలిన నాలుగు సినిమాలు ఫైనాన్స్ ఇబ్బందుల వలన విడుదల కాలేదు. ఆ విషయంలో ఆయన తండ్రి కాస్త కల్పించుకొని ఉంటే మిగిలిన సినిమాలు నిర్మాణం జరగడం పెద్ద కష్టమేమీ కాదు.

    కానీ ఆయన ఎందుకులే అని మౌనంగా ఉండిపోయాడు. మధ్యలో చాలా ఇబ్బందులకు గురయ్యాడు. అమెరికా వెళ్ళినప్పుడు తన ఖర్చులకు కూడా డబ్బులు లేకుండా ఇబ్బంది పడ్డాడు. తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకోవడంతో కనీసం ఇంటి గడప కూడా తొక్కనివ్వలేదు ఆయ‌న తండ్రి. దీంతో హైదరాబాదులోని మోకిలాలో తన కష్టార్జితంతో సొంత ఇల్లు నిర్మించుకున్నాడు.. అక్కడే ఉండిపోయాడు. చనిపోయిన తర్వాత ఆయన పార్ధీవదేహాన్ని కూడా అక్కడే ఉంచారు.

    ఎంత దౌర్భాగ్యం అంటే.. తన చెల్లెలి పెళ్లికి కూడా ఆయనకు ఆహ్వానం అందలేదు. పార్ధీవదేహాన్ని చూడడానికి వచ్చిన తారకరత్న తండ్రి మోహనకృష్ణ.. అలేఖ్య రెడ్డి ఆమె పిల్లలను కనీసం పలకరించ లేదు. ఈ ఘటన చూసి అక్కడకు వచ్చిన వాళ్ళందరూ షాక్ అయ్యారు.

    తను బతికున్నన్ని రోజులు తల్లిదండ్రుల గురించి మాట్లాడడానికి ఏమాత్రం ఇష్టం పడేవాడు కాదు తారక రత్న. తనకు తల్లి అయినా, తండ్రి అయినా, అన్నయ్య అయినా చివరకు దేవుడైన బాలయ్య బాబు మాత్రమే అని చెప్పుకునే వాడు. భవిష్యత్తులో అయినా మోహన్ కృష్ణ మ‌న‌సు కరిగి కోడలు అలేఖ్య రెడ్డిని, మ‌న‌వ‌డు, మనవరాళ్లని దగ్గరకు తీసుకుంటాడేమో చూడాలి.

    spot_img
    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular