Singareni | సింగరేణి డైరెక్టర్ ఈఅండ్ఎం వెల్లడి విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: జైపూర్ లోని సింగరేణి ధర్మల్ పవర్ ప్లాంట్ లో 1200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని సింగరేణి డైరెక్టర్ ఈఅండ్ఎం డీ సత్యనారాయణరావు తెలిపారు. మరో 800 మెగావాట్ల ఉత్పత్తి కోసం చేపట్టిన నిర్మాణ పనులు చకచక కొనసాగుతున్నయని అన్నారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సింగరేణి వర్క్ షాప్ ను ఆయన శనివారం సందర్శించారు. ఏరియా వర్క్ షాప్ అధికారులు, ఉద్యోగులు, నాయకులు […]

Singareni |
- సింగరేణి డైరెక్టర్ ఈఅండ్ఎం వెల్లడి
విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: జైపూర్ లోని సింగరేణి ధర్మల్ పవర్ ప్లాంట్ లో 1200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని సింగరేణి డైరెక్టర్ ఈఅండ్ఎం డీ సత్యనారాయణరావు తెలిపారు. మరో 800 మెగావాట్ల ఉత్పత్తి కోసం చేపట్టిన నిర్మాణ పనులు చకచక కొనసాగుతున్నయని అన్నారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సింగరేణి వర్క్ షాప్ ను ఆయన శనివారం సందర్శించారు.
ఏరియా వర్క్ షాప్ అధికారులు, ఉద్యోగులు, నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వర్క్ షాప్ కాన్ఫరెన్స్ హాల్లో ఇంజనీర్లు, సూపర్వైజర్లు, ఫోర్ మెన్లతో వర్క్ షాప్ లోని వివిధ విభాగాల పనులకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా సరియైన టెక్నాలజీ వాడుతూ త్వరితగతిన పనులు ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని సూచించారు.
కార్యక్రమంలో జీయం వర్క్ షాప్ ఎనర్జీ మేనేజ్మెంట్ అధికారి ఫీజ్ రోల్డ్, సీఎంఓఏ అపెక్స్ ప్రెసిడెంట్ ఏవి రెడ్డి, టీబీజీకేఎస్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ సురేందర్ రెడ్డి, ఫిట్ సెక్రటరీ వెంకటేశ్వర్లు, ఏరియా ఇంజినీర్ బీచంద్రశేఖర్ రెడ్డి, ఇంచార్జ్ డీజీయం సిరికొండ మల్లయ్య, ఇంజనీర్లు సతీష్ చక్రవర్తి, రాకేష్ రెడ్డి, ఫోర్ మెన్లు కే బ్రహ్మచారి, మోహన్, రవి, శ్రీనివాస్, మహేష్ రాజ్, ఆఫీస్ సూపరిండెంట్ రమేష్ పాల్గొన్నారు.
