Telangana | 121
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్నికల అధికారులు అప్రమత్తమయ్యారు. అన్ని నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయాలని ఎన్నికల కమిషన్ తమ కింది స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో అధికారులు ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేస్తున్నారు. ఈ క్రమంలో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. బోగస్ ఓటర్లు భారీగా బయటపడుతున్నాయి.
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పట్టణంలో 181 నుంచి 218 పోలింగ్ బూత్‌లు ఉన్నాయి. ఈ బూత్‌లకు సంబంధించిన ఓటర్ల జాబితాను పరిశీలిస్తుండగా, అత్యధికంగా బోగస్ ఓటర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఒక ఇంట్లో అయితే ఏకంగా 120 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బోగస్ ఓటర్ల ఏరివేత ప్రక్రియ కొనసాగుతోందని పటాన్‌చెరు తహసీల్దార్ పరమేశ్ పేర్కొన్నారు.