Telangana | యూత్ ఫర్ యాంటీ కరప్షన్ దరఖాస్తులో వెల్లడి విధాత, హైద్రాబాద్ : తెలంగాణలో అంగన్‌వాడీ కేంద్రాల నిర్వాహణ అధ్వాన్న దుస్థితిని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ బహిర్గతం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో పిల్లలకు, బాలింతలకు, గర్భిణీలకు పౌష్టికాహరాన్ని అందిస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం చెపుతోంది.అందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి వీధిలో అంగన్‌వాడీలను బలోపేతం చేస్తున్నామని, బలమైన ఆహారాన్ని కూడా అందిస్తున్నామంటుంది. తెలంగాణ అంగన్ వాడీ కేంద్రాల నిర్వాహణ తీరుతెన్నుల వివరాలపై దృష్టి సారించిన యూత్ ఫర్ యాంటీ […]

Telangana |
- యూత్ ఫర్ యాంటీ కరప్షన్ దరఖాస్తులో వెల్లడి
విధాత, హైద్రాబాద్ : తెలంగాణలో అంగన్‌వాడీ కేంద్రాల నిర్వాహణ అధ్వాన్న దుస్థితిని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ బహిర్గతం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో పిల్లలకు, బాలింతలకు, గర్భిణీలకు పౌష్టికాహరాన్ని అందిస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం చెపుతోంది.అందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి వీధిలో అంగన్‌వాడీలను బలోపేతం చేస్తున్నామని, బలమైన ఆహారాన్ని కూడా అందిస్తున్నామంటుంది.
తెలంగాణ అంగన్ వాడీ కేంద్రాల నిర్వాహణ తీరుతెన్నుల వివరాలపై దృష్టి సారించిన యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ మహిళ శిశు సంక్షేమ శాఖకు సమాచార హక్కు చట్టం ద్వారా వివరాల కోసం దరఖాస్తు చేయడంతో అంగన్‌వాడీ కేంద్రాల అధ్వాన్న పరిస్థితులు వెలుగుచూశాయి. తెలంగాణ అంగన్‌వాడీల్లో ఎలాంటి ఆహారాన్ని అందిస్తున్నారు.. ఎన్నింటికి పక్కా భవనాలు నిర్మించారు..ఎన్ని అద్దె భవనాల్లో ఉన్నాయన్న సమాచారాన్ని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థకు మహిళా శిశు సంక్షేమశాఖ సమాచారం ఇచ్చింది.
తెలంగాణలో మొత్తం అంగన్‌వాడీ కేంద్రాలు 35700 ఉన్నాయని, ఇందులో మెయిన్ 31711 కాగా, మినీ 3989 ఉన్నాయని మహిళాశిశు సంక్షేమశాఖ తెలిపింది. మెయిన్ అంగన్ వాడీ కేంద్రాలకు ప్రతి నెల మెయింట్‌నెన్స్ కింద 2000 ఇస్తుండగా, మినీ అంగన్‌వాడీ కేంద్రాలకు 1000 ఇస్తున్నారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికి 12221 అంగన్ వాడీ కేంద్రాలు ఇంకా అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయని మహిళ శిశు సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సమాచారం ఇచ్చారని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఫౌండర్ రాజేంద్ర తెలిపారు.
అహారం సరఫరా ఇలా
అంగన్ వాడీ కేంద్రాల ద్వారా 7 నెలల నుంచి 3సంవత్సరాల పిల్లలకు సూక్ష్మ పోషకాలతో ఫోర్టిప్యేడ్ చేయబడిన రోస్ట్ గోధుమలు, వేయించిన శనగపప్పు, పాలపొడి, చెక్కర, ఆయిల్, మెత్తగా పొడి చేసిన ఎంటిఎఫ్ లేదా బాలామృతం. ఒక్కొక్క లబ్ధిదారునకు, ఒక్క రోజుకి 100 గ్రాముల చొప్పున 25రోజులకు ప్రతినెల మొదటి రోజున రెండున్నర కిలోల ప్యాక్ పంపిణీ చేయబడుతుందని మహిళా శిశు సంక్షేమశాఖ తెలిపింది.
కాగా.. వారానికి 4 చొప్పున నెలకి 16 గ్రుడ్లు ఇవ్వబడునని పేర్కోంది. 3నుంచి 6 సంవత్సరాల పిల్లలకు అంగన్ వాడీ కేంద్రంలో ప్రతిరోజు (75 గ్రా బియ్యం, 15గ్రా పప్పు, 5గ్రా ఆయిల్, 25గ్రా కూరగాయలతో) వేడి భోజనం అందించబడునని, ప్రతి రోజు 20 గ్రాముల స్నాక్స్, వారానికి 4 గ్రుడ్లు చొప్పున నెలకి 16 గ్రుడ్లు అందించబడునని తెలిపింది.
గర్బిణీ స్త్రీలు, బాలింతలకు ఒక సంపూర్ణ భోజనం పెట్టబడునని, సంపూర్ణ భోజనం అంటే 150 గ్రాముల అన్నం, 30 గ్రాముల పప్పు, 16గ్రాముల ఆయిల్, 50 గ్రాముల ఆకుకూరలతో పాటు 200మి,లీ పాలు, ఒక గ్రుడ్డు ప్రతిరోజు అంగన్ వాడీ కేంద్రం వద్ద ఇవ్వబడునని వెల్లడించినట్లుగా యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఫౌండర్ రాజేంద్ర తెలిపారు.
