విధాత‌: పదమూడు అనగానే ఏదో హారర్ సినిమా గుర్తొస్తుంది. పాశ్చాత్యులు పదమూడును నెగెటివ్ గా భావిస్తారు. అందుకే పదమూడు చెడ్డ సంఖ్య అనే మాట ప్రాచూర్యంలో ఉంది. కొన్ని బిల్డింగ్స్ లో 13 ఫ్లోర్ ఉండదు. లిప్ట్ లో కూడా 13 నెంబర్ ఉండదు. మరి పదమూడు నిజంగా చెడ్డదేనా? ఒకసారి చూద్దాం. జ్యోతిషం, సంఖ్యాశాస్త్రం లో పదమూడు సంఖ్య కు చాలా ప్రాధాన్యత ఉంది. భారతీయులకు పదమూడు సంఖ్య ప‌విత్రమైంది. ఎన్నో రకాల సంప్రదాయాల్లో పదమూడు […]

విధాత‌: పదమూడు అనగానే ఏదో హారర్ సినిమా గుర్తొస్తుంది. పాశ్చాత్యులు పదమూడును నెగెటివ్ గా భావిస్తారు. అందుకే పదమూడు చెడ్డ సంఖ్య అనే మాట ప్రాచూర్యంలో ఉంది. కొన్ని బిల్డింగ్స్ లో 13 ఫ్లోర్ ఉండదు. లిప్ట్ లో కూడా 13 నెంబర్ ఉండదు. మరి పదమూడు నిజంగా చెడ్డదేనా? ఒకసారి చూద్దాం.

జ్యోతిషం, సంఖ్యాశాస్త్రం లో పదమూడు సంఖ్య కు చాలా ప్రాధాన్యత ఉంది. భారతీయులకు పదమూడు సంఖ్య ప‌విత్రమైంది. ఎన్నో రకాల సంప్రదాయాల్లో పదమూడు సంఖ్య పవిత్రంగా భావిస్తారు. కొన్ని రకాల పూజల్లో 13 రకాల పండ్లు వాడుతారు, పదమూడు రకాల పువ్వులతో పూజిస్తారు, కొన్ని రకాల ఉత్సవాలు కూడా పదమూడు రోజుల పాటు చేస్తుంటారు. పదమూడు సంఖ్యను అదృష్ట సంఖ్యగా భావిస్తారు. చాంద్రమానాన్ని అనుకసరించి తిథుల్లో పదమూడోది త్రయోదశి మంచిరోజు. ఇది శివుడికి ప్రీతి పాత్రమైన రోజు. త్రయోదశి రోజున ఉపవాస దీక్ష చేసే వారికి పాపాల నుంచి విముక్తి దొరుకుతుంది.

13 వల్లే కర్మ ఫలం?

న్యూమరాలజీలో 13 సంఖ్య ఏకాగ్రత, స్వేచ్ఛ, సృజనాత్మకతను సూచిస్తుంది. ఇది జీవితంలో ఎదురయ్యే సవాళ్ల‌ను ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది, కర్మలను తప్పిస్తుంది. కర్మను నమ్మని వాళ్లకు మాత్రం 13 దురదృష్ట సంఖ్య అని అనిపించి తీరుతుంది.

జన్మిస్తే?

ఏదైనా పని ప్రారంభిస్తే 13వ రోజున కచ్చితంగా మంచి ఫలితాలు కనిపించడం మొదలవుతుంది. పదమూడు అనేది 4కు చెందిన సంఖ్య. నాలుగు అదృష్టాన్ని తెచ్చే నంబర్. డెస్టినీ నంబర్ 1, 3, 4 కలిగి ఉన్న వారు చాలా తెలివైన వారని స్ట్రీట్ స్మార్ట్ గా కూడా ఉంటారని శాస్త్రం చెబుతోంది.

పదమూడు మన జీవితాలకు పూర్ణత్వాన్నిఇచ్చే సంఖ్య. ఇది పూర్తి జీవిత చక్రాన్ని ప్రతిబింబిస్తుంది. నాలుగు కాలాల్లో మొత్తం పదమూడు వారాలు ఉంటాయ. టీన్ ఏజ్ ప్రారంభం అయ్యేది కూడా 13 వయసులోనే. అయితే ఈ పదమూడు సంఖ్య మరణ సమయానికి అంతిమ సంస్కారాలకు సంబంధించినవి కనుక అందరూ ఈ సంఖ్యను చూసి భయపడతారు.

మంచి కర్మలతో జీవితం పూర్తి చేసిన వారు ప్రశాంతంగా మరణిస్తారు. అలా ప్రశాంతంగా మరణించిన వారికి ముక్తి లభిస్తుంది. అది అంతా మన మనసులోనే ఉంది. మనం జీవిత కాలంలో చేసినవి మంచి పనులే అందులో ఏ అనుమానం లేదు అనుకుంటే సద్గతి లేదా మన మనసులో ఉన్న అపరాధ భావమే దుర్గతి.

చేసిన దానికి జీవితంలో ఫలితం అయితే అనుభవించాల్సిందే. మనసులో వికారాలు లేకుండా మంచి పనులు చేస్తున్నంత కాలం మనకు 13 అన్ లక్కీ అని అనుకునే అవసరం లేదు.

Updated On 17 Dec 2022 1:41 PM GMT
CH RAJITHA

CH RAJITHA

Next Story