Brazil | విధాత: బ్రెజిల్ (Brazil) లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఇక్కడి అమెజోనస్ రాష్ట్రంలో ఒక చిన్న విమానం కూలిపోగా (Plane Crash) అందులో ఉన్న 14 మంది ప్రాణాలు కోల్పోయారు. శనివారం జరిగిన ఈ దుర్ఘటనకు ప్రతికూలంగా మారిన వాతావరణమే కారణమని తెలుస్తోంది. బ్రెజిల్ రాజధాని మానస్ నుంచి వస్తున్న ఈ విమానం తుపాను తరహా పరిస్థితుల్లో బార్సిలోనాలో ల్యాండ్ అవ్వడానికి యత్నిస్తుండగా పట్టు తప్పి విమానం కూలిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు […]

Brazil |
విధాత: బ్రెజిల్ (Brazil) లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఇక్కడి అమెజోనస్ రాష్ట్రంలో ఒక చిన్న విమానం కూలిపోగా (Plane Crash) అందులో ఉన్న 14 మంది ప్రాణాలు కోల్పోయారు. శనివారం జరిగిన ఈ దుర్ఘటనకు ప్రతికూలంగా మారిన వాతావరణమే కారణమని తెలుస్తోంది.
బ్రెజిల్ రాజధాని మానస్ నుంచి వస్తున్న ఈ విమానం తుపాను తరహా పరిస్థితుల్లో బార్సిలోనాలో ల్యాండ్ అవ్వడానికి యత్నిస్తుండగా పట్టు తప్పి విమానం కూలిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
'భారీ వర్షం కురుస్తుండగా పైలట్ ల్యాండింగ్‌కు యత్నించారు. ఆ సమయంలో చాలా తక్కువ విజబిలిటీ ఉంది. ఆధారాలను చూస్తుంటే అతడు రన్‌వే మొదలు అనుకుని మధ్యలో విమానాన్ని దించారు' అని సంబంధిత అధికారి ఒకరు పేర్కొన్నారు.
దీంతో అది రన్‌వేను దాటి ముందుకు పోయి కూలిపోయిందని తెలిపారు. ఈఎంబీ 110 పేరుతో రిజిస్టర్ అయిన ఈ విమానం రెండు ఇంజిన్లతో పనిచేస్తుంది. మృతులంతా బ్రెజిల్ దేశస్థులేనని.. బార్సిలోనాకు చేపలు పట్టడానికి (స్పోర్ట్ ఫిషింగ్) వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
