మేష రాశి : వస్తు నష్టములు ఆందోళన కలిగిస్తాయి. తరుచూ ప్రయాణాల వలన ఇబ్బందులు కలుగుతాయి. అపవాదుల వలన మనశ్శాంతి లోపిస్తుంది. దుర్వార్త శ్రవణములు కలుగవచ్చును.
వృషభ రాశి : అజీర్ణము వలన శరీర బాధలు కలుగవచ్చును. ఖర్చుల విషయంలో ఆలోచనలు ఎక్కువవుతాయి. నిద్రాసౌఖ్యము తక్కువగా వుంటుంది. కోపమును అదుపులో ఉంచుకోవాలి.
మిథున రాశి : ప్రముఖులతో పరిచయములు లాభిస్తాయి. కొత్త బాధ్యతలు ఏర్పడతాయి. అక్కాచెల్లెళ్ళతో సంభాషణలు మనః సంతృప్తి కలిగిస్తాయి. ఆకస్మాత్తుగా ధనప్రాప్తి సంతోషాన్నిస్తుంది.
కర్కాటక రాశి : మీ అభీష్టమునకు తగిన పనులను నిర్వహించడం సంతోషాన్నిస్తుంది. ప్రముఖులతో కలిసి సత్సంగములో పాల్గొంటారు. నూతన వస్తు ప్రాప్తి కలుగుతుంది. ధన ధాన్య సమృద్ది లభిస్తుంది.
సింహ రాశి : ఇష్టమైన వస్తువులు చేతి కందక పోవడం బాధిస్తుంది. కుటుంబ సభ్యులపై అపవాదులు ఆందోళన కలిగిస్తాయి. దుర్జన సహవాసము అపకీర్తి కలిగిస్తుంది. మనోధైర్యము లోపించుటచే కార్య విఘ్నములు కలుగుతాయి.
కన్యా రాశి : వృధా సంచారము చేయవలసి వస్తుంది. అధికారుల మూలక అశాంతి కలుగుతుంది. శతృవులతో కలయికలు చికాకు తెప్పిస్తాయి. భోజన సౌఖ్యము తక్కువగా వుంటుంది.
తులా రాశి : బంధుమిత్రుల ఆదరణ సంతోషానిస్తుంది. శతృవులు మిత్రులవుతారు. వైద్య రంగంలోని వారికి అపవాదులు తొలగిపోతాయి. ఆత్మస్థైర్యముతో కార్యసిద్ధి కలుగుతుంది. ధన ప్రాప్తి కలుగుతుంది.
వృశ్చిక రాశి : గతంలో చేసిన పొరపాట్లు పశ్చాత్తాపాన్ని కలిగిస్తాయి. సంతానములక అశాంతి కలుగవచ్చును. వృత్తి, ఉద్యోగాలలో పని ఒత్తిడి ఎక్కువగా వుంటుంది. వాహన మూలక అశాంతి కలుగవచ్చును.
ధనస్సు రాశి : బంధుమిత్రుల మూలక సంతోషములు కలుగుతాయి. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు. శరీర సౌఖ్యము ఉల్లాసాన్నిస్తుంది. తృప్తి కరమైన భోజనం లభిస్తుంది. నష్ట ధన ప్రాప్తి కలుగుతుంది.
మకర రాశి : పరోపకారముల వలన గౌరవ మర్యాదలు లభిస్తాయి. పెద్దల ఆదరణ లభిస్తుంది. కుటుంబ మూలన సౌఖ్యం లభిస్తుంది. విద్యార్థులు సత్సాంగత్యము వలన కొత్త విషయాలను తెలుసుకుంటారు. విశేష లాభములు సంతోషాన్నిస్తాయి.
కుంభ రాశి : విద్యార్థులు సత్ఫలితాలను పొందుతారు. కవులు, కళాకారులకు ఖ్యాతి లభిస్తుంది. ఇష్టమైన వ్యక్తులతో కాలక్షేపం సంతోషాన్నిస్తుంది. దైవ దర్శనాలు సంతోషాన్ని కలిగిస్తాయి.
మీన రాశి : మాటలతో కార్యసిద్ధి కలుగుతుంది. మోసగాళ్ల బారి నుండి తప్పించుకుంటారు. బంధుమిత్రుల కలయికలు ఆనందాన్నిస్తాయి. అకస్మాత్తు సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి. ధనలాభాములుంటాయి.
– తూండ్ల కమలాకర శర్మ సిద్ధాంతి,
కూకట్‌పల్లి, హైదరాబాద్
ఫోన్ నంబర్ : +91 99490 11332.