Reservoirs | విధాత: దేశంలోని అత్యధిక జలాశయాలు నీటి కొరత ఎదుర్కొంటున్నాయి. దేశవ్యాప్తంగా 150 పెద్ద, ప్రధాన రిజర్వాయర్లలో సగటు కంటె తక్కువ నీటి నిల్వలు ఉన్నాయి. గత ఆగస్టు 31 నాటికి ఆయా రిజర్వాయర్లలో 113 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు ఉన్నట్టు సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) తాజా నివేదికలో వెల్లడించింది. ఆగస్టు 122 ఏండ్లలో ఎన్నడూ లేనంత లోటు వర్షపాతం నమోదు కావడం ఇందుకు కారణంగా తెలుస్తున్నది. గత సంవత్సరం ఇదే సమయంతో […]

Reservoirs |
విధాత: దేశంలోని అత్యధిక జలాశయాలు నీటి కొరత ఎదుర్కొంటున్నాయి. దేశవ్యాప్తంగా 150 పెద్ద, ప్రధాన రిజర్వాయర్లలో సగటు కంటె తక్కువ నీటి నిల్వలు ఉన్నాయి. గత ఆగస్టు 31 నాటికి ఆయా రిజర్వాయర్లలో 113 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు ఉన్నట్టు సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) తాజా నివేదికలో వెల్లడించింది.
ఆగస్టు 122 ఏండ్లలో ఎన్నడూ లేనంత లోటు వర్షపాతం నమోదు కావడం ఇందుకు కారణంగా తెలుస్తున్నది. గత సంవత్సరం ఇదే సమయంతో పోల్చుకుంటే దాదాపు దేశంలోని 150 రిజర్వాయర్లలో నీటి మట్టాలు నిరుడు కంటే కంటే 22% తక్కువగా ఉన్నాయి. పదేండ్ల నీటి నిల్వ సగటు కంటే దాదాపు పదిశాతం తక్కువగా ఉన్నాయి.
జూలై చివరి నాటికి, జూలైలో మంచి వర్షపాతం కారణంగా సగటు రిజర్వాయర్ స్థాయిలు ఆగస్టు కంటే మెరుగ్గా ఉన్నాయి. సెప్టెంబర్‌లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం రైతుల్లో, సామాన్య ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నది..
ప్రస్తుతం ఉన్న ఎల్ నినో పరిస్థితులు రుతుపవనాల లోటుకు కారణమయ్యాయి. ముఖ్యంగా నదీ పరీవాహక ప్రాంతాల్లో రిజర్వాయర్ స్థాయి తక్కువగా ఉండటానికి కారణం. ఎల్ నినో వాతావరణ పరిస్థితులు భూమధ్యరేఖ పసిఫిక్ మహాసముద్రం వేడెక్కడం వల్ల భారతదేశంలో రుతుపవనాలు బలహీనంగా మారినట్టు గుర్తించారు.
