160 Kg | Maharashtra | సాయం కోసం ఫైర్ సిబ్బందికి ఫోన్ మహారాష్ట్రలోని థానేలో ఘటన విధాత: ఒబేసిటీ (లావుగా) వ్యక్తులు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. వారు సరిగ్గా నిలబడలేరు. నడవ లేరు కూడా. అనారోగ్య సమస్యలు కూడా వేధిస్తుంటాయి. అందుకే చాలా మంది లావుగా ఉండేవారు బరువు తగ్గడానికి అనేక చర్యలు పడుతుంటారు. కసరత్తులు, డైటింగ్ అంటూ చాలా కష్టపడుతుంటారు. తాజాగా మహారాష్ట్రలో 160 కిలోల బరువున్న మహిళ మంచం మీద […]

160 Kg | Maharashtra |
- సాయం కోసం ఫైర్ సిబ్బందికి ఫోన్
- మహారాష్ట్రలోని థానేలో ఘటన
విధాత: ఒబేసిటీ (లావుగా) వ్యక్తులు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. వారు సరిగ్గా నిలబడలేరు. నడవ లేరు కూడా. అనారోగ్య సమస్యలు కూడా వేధిస్తుంటాయి. అందుకే చాలా మంది లావుగా ఉండేవారు బరువు తగ్గడానికి అనేక చర్యలు పడుతుంటారు. కసరత్తులు, డైటింగ్ అంటూ చాలా కష్టపడుతుంటారు.
తాజాగా మహారాష్ట్రలో 160 కిలోల బరువున్న మహిళ మంచం మీద నుంచి పడిపోయింది. ఆమెను పైకి లేపడానికి కుటుంబసభ్యులు ఫైర్‌స్టేషన్‌కు ఫోన్‌చేసి సహాయం కోరారు. థానే మున్సిపల్ కార్పొరేషన్ (టీఎంసీ)కు చెందిన డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెల్ చీఫ్ యాసిన్ తాడ్వి ప్రకారం..62 ఏండ్ల మహిళకు ఆరోగ్యం సరిగా నడవలేని పరిస్థితి తలెత్తింది. థానేలోని వాగ్‌బిల్ ప్రాంతంలోని తన ఫ్లాట్‌లో ఉదయం 8 గంటలకు ప్రమాదవశాత్తు ఆమె మంచం మీద నుంచి పడిపోయింది.
కుటుంబ సభ్యులు ప్రయత్నం చేసినప్పటికీ ఆమెను మంచంపై తిరిగి పడుకోబెట్ట లేకపోయారు. దీంతో వారు వెంటనే థానే మున్సిపల్ కార్పొరేషన్ (TMC)కు ఫోన్ చేశారు. మంచంపై తిరిగి పడుకోబెట్టడానికి సహాయం చేయాలని కోరారు. స్పందించిన అధికారులు కొంత మంది సిబ్బందిని పంపించగా, వారు వచ్చి మహిళలను మంచంపై పడుకోబెట్టారు. అయితే, ఆమె మంచంపై నుంచి కింద పడినప్పుడు ఎలాంటి గాయాలు కాలేదని కుటుంబసభ్యులు తెలిపారు.
