Mancherial టాస్క్ ఫోర్స్ బృందానికి పట్టుబడిన నిందితుడు క్రెడిట్ కార్డులు, చెక్కు బుక్కులు, నగదు స్వాధీనం విధాత ప్రతినిధి, ఉమ్మడి అదిలాబాద్: షేర్ మార్కెట్ పేరుతో అమాయక ప్రజలను ముంచిన ఘరానా మోసగాడు ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డాడు. మంగళవారం రామగుండం టాస్క్ ఫోర్స్ ఏసీసీ మల్లారెడ్డి విలేకరులకు కేసు వివరాలు వెల్లడించారు. మంచిర్యాల పట్టణంలోని గోసేవా మండల్ రోడ్ కు చెందిన చెవ్వా రవి మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో అమాయక ప్రజలను మోసం చేస్తూ వచ్చాడు. షేర్ […]

Mancherial

  • టాస్క్ ఫోర్స్ బృందానికి పట్టుబడిన నిందితుడు
  • క్రెడిట్ కార్డులు, చెక్కు బుక్కులు, నగదు స్వాధీనం

విధాత ప్రతినిధి, ఉమ్మడి అదిలాబాద్: షేర్ మార్కెట్ పేరుతో అమాయక ప్రజలను ముంచిన ఘరానా మోసగాడు ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డాడు. మంగళవారం రామగుండం టాస్క్ ఫోర్స్ ఏసీసీ మల్లారెడ్డి విలేకరులకు కేసు వివరాలు వెల్లడించారు. మంచిర్యాల పట్టణంలోని గోసేవా మండల్ రోడ్ కు చెందిన చెవ్వా రవి మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో అమాయక ప్రజలను మోసం చేస్తూ వచ్చాడు.

షేర్ మార్కెట్ లో డబ్బులు పెట్టుబడి పెడితే , తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని నమ్మించి ఆశ చూపాడు. మీరు నాకు డబ్బులు ఇస్తే మీకు ఎక్కువ లాభాలు రోజువారీగా, వారం రోజుల వారీగా, నెల వారీగా అధిక మొత్తంలో లాభంతో డబ్బులు ఇస్తాను అని మాయమాటలు చెప్పాడు. వారిని నమ్మించి 50 మంది వద్ద నుంచి సుమారు రూ. 2.11 కోట్లు వసూలు చేశాడు.

ఈ మొత్తంలో కొంత షేర్ మార్కెట్ లో పెట్టుబడిగా పెట్టాడు. అందులో నష్టం వచ్చింది. మరికొంత డబ్బు తన సొంతానికి వాడుకున్నాడు. డబ్బులిచ్చిన బాధితులు చెవ్వారవి వెంట పడ్డారు. ఐదు నెలలుగా తప్పించుకు తిరుగుతున్నాడు. విసిగిపోయిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు మేరకు రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి కేసును సీరియస్ గా తీసుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఏసీపీ మల్లారెడ్డి, టాస్క్ ఫోర్స్ ఇన్ స్పెక్టర్ సుధాకర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, నిందితుడి కోసం గాలించారు.

.ఈ క్రమంలో చెవ్వా రవి మరికొంత మంది వద్ద నుంచి డబ్బులు వసూలు చేసేందుకు హైదరాబాద్ నుంచి మంచిర్యాలకు వస్తున్నాడానే సమాచారం దర్యాప్తు బృందం అందుకుంది. నిందితుడిపై నిఘా పెట్టి, మంచిర్యాల రైల్వే బ్రిడ్జ్ ప్రాంతంలో పట్టణ పోలీసులతో కలసి పట్టుకున్నారు. అతని వద్ద నుంచి క్రెడిట్ కార్డులు, బ్యాంక్ పాస్ బుక్స్, చెక్కు బుక్స్, రూ.8,100 నగదు, రిజిస్టర్ బుక్ స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో టాస్క్ ఫోర్స్ ఏసీసీ మల్లారెడ్డి, టాస్క్ ఫోర్స్ ఇన్ స్పెక్టర్ సుధాకర్, అశోక్, టాస్క్ ఫోర్స్ ఎస్సై ప్రసాద్, లచ్చన్న, సిబ్బంది పాల్గొన్నారు.

Updated On 12 Sep 2023 1:33 PM GMT
somu

somu

Next Story