2.95 Carat Diamond | పుట్టినరోజు జరుపుకోవడానికి తండ్రితో కలిసి పార్క్‌కు వెళ్లిన ఓ బాలికకు అనుకోని అతి విలువైన బహుమతి లభించింది. పార్కులో తచ్చాడుతూ ఉండగా మిలమిలా మెరిసే ఒక రాయిని తీసి తండ్రికి ఇవ్వగా దాని విలువను గుర్తించిన తండ్రి ఆశ్చర్య పోయాడు. అమెరికా (America) లోని అర్కాన్‌సాస్ రాష్ట్రంలో ఉన్న పారాగౌల్డ్ నగరంలో ఈ ఘటన జరిగింది. ఏడేళ్ల ఆస్పెన్ బ్రౌన్ అనే బాలిక తన తండ్రి, నాయనమ్మతో కలిసి ఈ నెల […]

2.95 Carat Diamond |
పుట్టినరోజు జరుపుకోవడానికి తండ్రితో కలిసి పార్క్‌కు వెళ్లిన ఓ బాలికకు అనుకోని అతి విలువైన బహుమతి లభించింది. పార్కులో తచ్చాడుతూ ఉండగా మిలమిలా మెరిసే ఒక రాయిని తీసి తండ్రికి ఇవ్వగా దాని విలువను గుర్తించిన తండ్రి ఆశ్చర్య పోయాడు. అమెరికా (America) లోని అర్కాన్‌సాస్ రాష్ట్రంలో ఉన్న పారాగౌల్డ్ నగరంలో ఈ ఘటన జరిగింది.
ఏడేళ్ల ఆస్పెన్ బ్రౌన్ అనే బాలిక తన తండ్రి, నాయనమ్మతో కలిసి ఈ నెల 1న స్థానికంగా ఉన్న డైమండ్స్ స్టేట్ పార్కుకు వెళ్లింది. ఆ రోజు ఆమె పుట్టిన రోజు కావడంతో బాగా ఎంజాయ్ చేయడానికి అక్కడకు వెళ్లారు. అక్కడ ఆడుకుంటూ అటూ ఇటూ పరిగెడుతూ ఉండగా.. తనకు ప్రత్యేకంగా అనిపించిన ఒక రాయిని తీసుకుని తండ్రి వద్దకు తీసుకెళ్లింది.
అతడు దాన్ని చూసి అది ఒక వజ్రం అని గుర్తించాడు. వెంటనే పార్క్ అధికారులకు దానిని చూపించగా.. దానిని 3.29 క్యారెట్ల బ్రౌన్ డైమండ్ అని నిర్ధరించారు. ఈ ఏడాది పార్క్‌లో దొరికిన అత్యంత బరువైన ఇదేనని పార్క్ తన ప్రకటనలో పేర్కొంది. ఈ వజ్రం ఎవరికి దొరికితే వారికే ఇచ్చేస్తామని తెలిపింది.
మరణించిన అగ్ని పర్వతంపై ఈ డైమండ్స్ స్టేట్ పార్క్ ఉంటుంది. ఇది మొత్తం 37.5 ఎకరాల్లో విస్తరించి ఉండగా దీనిని ఉత్తర భాగంలో అప్పుడప్పుడూ వజ్రాలు దొరుకుతుంటాయి. అలానే బ్రౌన్‌కు పుట్టినరోజు నాడు అదృష్టం వరించి ఈ భారీ వజ్రం దొరికింది.
పార్కులో కలియతిరగడంతో తనకు బాగా నీరసం వచ్చింది. నాన్నా అలా పక్కన కూర్చుంటానని అక్కడే ఉన్న బండ రాళ్ల వద్దకు వెళ్లింది. తర్వాత కొద్ది సేపటికే నేను ఒకటి కనిపెట్టా అని నా దగ్గరకు వచ్చి చెప్పింది అని బ్రౌన్ తండ్రి గుర్తు చేసుకున్నారు. తను వజ్రాన్ని కావాలని వెతకలేదని.. సరైన సమయంలో సరైన చోట ఉందని పేర్కొన్నారు.
