Encounter ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది హతం కొనసాగుతున్న గాలింపు చర్యలు విధాత: జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో శనివారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ఉరిలోని నియంత్రణ రేఖ సమీపంలో గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. “బారాముల్లా జిల్లాలోని ఉరి, హత్లాంగా ప్రాంతంలో ఉగ్రవాదులు-ఆర్మీ, బారాముల్లా పోలీసుల మధ్య ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నది” అని కశ్మీర్ పోలీస్‌జోన్ సోషల్ మీడియాలో వెల్లడించింది. బారాముల్లా జిల్లాలో లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) […]

Encounter
- ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది హతం
- కొనసాగుతున్న గాలింపు చర్యలు
విధాత: జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో శనివారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ఉరిలోని నియంత్రణ రేఖ సమీపంలో గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. “బారాముల్లా జిల్లాలోని ఉరి, హత్లాంగా ప్రాంతంలో ఉగ్రవాదులు-ఆర్మీ, బారాముల్లా పోలీసుల మధ్య ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నది” అని కశ్మీర్ పోలీస్‌జోన్ సోషల్ మీడియాలో వెల్లడించింది.
బారాముల్లా జిల్లాలో లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులల సహచరులను శుక్రవారం పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసున్నారు. వీరిద్దరినీ మీర్ సాహిబ్ బారాముల్లా నివాసి జైద్ హసన్ మల్లా, స్టేడియం కాలనీ బారాముల్లాకు చెందిన మహ్మద్ ఆరిఫ్ చన్నాగా పోలీసులు గుర్తించారు. మరుసటి రోజు ఎన్‌కౌంటర్ చోటుచేసుకున్నది.
కాగా, అనంతనాగ్ జిల్లా అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు ఆపరేషన్ నాలుగో కూడా కొనసాగుతున్నది. ఉగ్రవాదులను ఏరివేసే ఆపరేషన్ శుక్రవారం మూడో రోజుకు చేరుకోవడంతో ఉగ్రవాదుల ఆచూకీని గుర్తించేందుకు భద్రతా బలగాలు డ్రోన్లను వినియోగిస్తున్నాయి.
ఉగ్రవాదులు ఉన్నట్టు వచ్చిన సమాచారం ఆధారంగా గాలింపు చర్యలు ప్రారంభించామని, చిక్కుకున్న ఇద్దరు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెడతామని అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (కశ్మీర్) విజయ్ కుమార్ తెలిపారు.
