Homeఆంధ్ర ప్రదేశ్20 అడుగుల గిరి నాగుపాము.. చూస్తే వ‌ణుకు త‌ప్ప‌దు..

20 అడుగుల గిరి నాగుపాము.. చూస్తే వ‌ణుకు త‌ప్ప‌దు..

vidhaatha: This Cobra locals called (giri nagu) which is about 20 feet long, wandered in the gardens of Yarnagudem Pamayul in Devarapalli mandal of West Godavari district andhrapradesh state, india is startled people recently. Locals are in a state of panic after seeing these terrifying this type of cobras (Giri Nag).

విధాత: పాములను చూసినా, ఆ పేరు విన్నా శ‌రీరమంతా వ‌ణికిపోతోంది. ఒక్క‌సారిగా గుండె వేగం పెరిగిపోతోంది. శ‌రీర‌మంతా చెమ‌ట‌లు ప‌ట్టేస్తాయి. అయితే ప్ర‌తి ఒక్క‌రూ నాగుపాముల‌ను చూసే ఉంటారు. కానీ ఇలాంటి నాగుపామును చూసి ఉండ‌క‌పోవ‌చ్చు. ఎందుకంటే ఈ పాము ఐదారడుగులు కాదు.. ఏకంగా 20 అడుగుల పొడ‌వు ఉంది.

ముంగీస చేతిలో మట్టి కరిచిన నల్ల త్రాచు.. వీడియో వైరల్

అందులోను మళ్లీ ఓ ఆరు అడుగుల వ‌ర‌కు ప‌డ‌గ విప్పి బుసలు కొడుతోంది. మ‌రి అలాంటి పామును చూడాలంటే గుండెల్లో ధైర్యం ఉండాల్సిందే. అయితే ఇలాంటి కింగ్ కోబ్రాలు అధికంగా కేర‌ళ‌, ఆ స‌మీప ప్రాంతాల్లో ఎక్కువ సంచ‌రిస్తుంటాయి. ఇవి అధికంగా దట్టమైన ఆడవుల్లో మాత్రమే ఉంటాయి.. జనావాసాల్లోకి రావడం చాలా అరుదు.

కానీ ఇప్పుడు ఆ కింగ్ కోబ్రాలు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ఏపీలోని ప‌శ్చిమ ఏజెన్సీలో గిరినాగులు మాత్రం అప్పుడప్పుడు క‌నిపిస్తున్నాయి. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం పామాయుల్‌ తోటల్లో దాదాపు 20 అడుగుల పొడ‌వు ఉన్న ఈ గిరి నాగు సంచరిస్తూ జనాలను ముచ్చెమటలు పట్టించింది. ఈ భ‌యంక‌ర‌మైన గిరి నాగల‌ను చూసి స్థానికులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు.

spot_img
spot_img
RELATED ARTICLES

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Latest News

Cinema

Politics

Most Popular