Hyderabad విధాత: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్, హసన్ నగర్‌లో భారీ కొండచిలువ కలకలం రేపింది. జనావాసాల మధ్య లారీ పార్కింగ్ స్థలంలో దీన్ని గుర్తించారు. డ్రైవర్లు లారీ పార్కింగ్ చేసి, అక్కడే ఉండగా శబ్దం వచ్చింది. వెంటనే అప్రమత్తమై చుట్టుపక్కల పరిశీలించారు. అక్కడ సుమారు 20 అడుగుల పొడవు ఉన్న భారీ కొండచిలువను చూసి ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. పోలీసులు, ఆటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. స్థానికులు కొండ చిలువను బంధించి, అటవీ శాఖ అధికారులకు […]

Hyderabad
విధాత: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్, హసన్ నగర్‌లో భారీ కొండచిలువ కలకలం రేపింది. జనావాసాల మధ్య లారీ పార్కింగ్ స్థలంలో దీన్ని గుర్తించారు. డ్రైవర్లు లారీ పార్కింగ్ చేసి, అక్కడే ఉండగా శబ్దం వచ్చింది. వెంటనే అప్రమత్తమై చుట్టుపక్కల పరిశీలించారు. అక్కడ సుమారు 20 అడుగుల పొడవు ఉన్న భారీ కొండచిలువను చూసి ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు.
పోలీసులు, ఆటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. స్థానికులు కొండ చిలువను బంధించి, అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. భారీ కొండచిలువ అడవులు వదలి జనావాసాల మధ్యకు చేరుకోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు
