Libya | లిబియాను భారీ వర్షాలు ముంచెత్తాయి. వరదలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాలు, వరదలకు 2 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 1000 మంది గల్లంతయ్యారు. పలు భవనాలు ధ్వంసమయ్యాయి. దీంతో వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. లిబియన్ నేషనల్ ఆర్మీ అధికార ప్రతినిధి అహ్మద్ మిస్మరి మాట్లాడుతూ.. డెర్నా నదిపై ఉన్న ఆనకట్టలు కూలిపోవడంతోనే ఈ విపత్తు సంభవించిందని పేర్కొన్నారు. దీంతో చాలా మంది వరదల్లో సముద్రంలోకి కొట్టుకుపోయారని తెలిపారు. ఈ వరదలకు […]

Libya | లిబియాను భారీ వర్షాలు ముంచెత్తాయి. వరదలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాలు, వరదలకు 2 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 1000 మంది గల్లంతయ్యారు. పలు భవనాలు ధ్వంసమయ్యాయి. దీంతో వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
లిబియన్ నేషనల్ ఆర్మీ అధికార ప్రతినిధి అహ్మద్ మిస్మరి మాట్లాడుతూ.. డెర్నా నదిపై ఉన్న ఆనకట్టలు కూలిపోవడంతోనే ఈ విపత్తు సంభవించిందని పేర్కొన్నారు. దీంతో చాలా మంది వరదల్లో సముద్రంలోకి కొట్టుకుపోయారని తెలిపారు. ఈ వరదలకు దాదాపు 250 మంది కొట్టుకుపోయి ఉంటారని చెప్పారు.
గతవారం గ్రీస్‌ను అతలాకుతలం చేసిన తుఫాను, ఆదివారం మధ్యధరా సముద్రంలోకి ప్రవేశించి, డెర్నాలో బీభత్సం సృష్టించిందని పేర్కొన్నారు. రోడ్లు, భవనాలు ధ్వంసం అయ్యాయి. లిబియా యొక్క రెండో అతిపెద్ద నగరం బెంఘాజీతో సహా తీరం వెంబడి ఉన్న స్థావరాలను తుఫాను తాకిందన్నారు.
ఈ వరదల్లో లిబియన్ నేషనల్ ఆర్మీకి చెందిన ఏడుగురు మరణించినట్లు పేర్కొన్నారు.
