2000 Notes | రూ.2000వేల నోట్ల చెలామణి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెనక్కి తీసుకున్నది. ఈ మే 19న నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించగా.. ప్రస్తుతం చెలామణిలో ఉన్న వాటిని మార్చుకునేందుకు సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చిన విషయం తెలిసిందే. బ్యాంకులో మార్చుకునేందుకు, ఖాతాల్లోనైనా డిపాజిట్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ నెలాఖరుతో గడువు ముగియనున్నది. అయితే, ఇంకా చెలామణిలో ఉన్న నోట్ల విలువ ఎంత ? గడువు తర్వాత నోట్లు చెల్లబోవా? ఇప్పటి వరకు […]

2000 Notes |
రూ.2000వేల నోట్ల చెలామణి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెనక్కి తీసుకున్నది. ఈ మే 19న నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించగా.. ప్రస్తుతం చెలామణిలో ఉన్న వాటిని మార్చుకునేందుకు సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చిన విషయం తెలిసిందే.
బ్యాంకులో మార్చుకునేందుకు, ఖాతాల్లోనైనా డిపాజిట్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ నెలాఖరుతో గడువు ముగియనున్నది. అయితే, ఇంకా చెలామణిలో ఉన్న నోట్ల విలువ ఎంత ? గడువు తర్వాత నోట్లు చెల్లబోవా? ఇప్పటి వరకు వచ్చిన నోట్ల విలువ ఎంత ? తెలుసుకుందాం రండి..!
మార్కెట్‌లో ఉన్నది 7 శాతం..
భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.2వేల నోట్లను నవంబర్, 2006లో ప్రవేశపెట్టింది. పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన అనంతరం.. ఈ నోట్లను తీసుకువచ్చింది. నోట్లను తీసుకువచ్చిన క్ష్యం నెరవేరిందని.. అందుకే వాటిని ఉపసంహరించుకుంటున్నట్లు ఈ ఏడాది మేలో ఆర్‌బీఐ వెల్లడించింది. దాంతో రూ.2వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది.
ఆయా నోట్లను మార్చుకునేందుకు సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చింది. ఆ తర్వాత బ్యాంకుల్లో మార్చుకునేందుకు అవకాశం కల్పించగా.. ఇప్పటి వరకు చెలామణిలో ఉన్న నోట్లలో 93శాతం నోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చాయని ఆర్‌బీఐ వెల్లడించింది. ప్రస్తుతం మార్కెట్‌లో ఇంకా 7శాతం మాత్రమే చెలామణిలో ఉన్నాయని చెప్పింది.
ఈ ఏడాది ఆగస్టు 31న వరకు బ్యాంకుల్లో డిపాజిట్ అయిన రూ.2,000 నోట్ల మొత్తం విలువ రూ.3.32 లక్షల కోట్లు అని, అదే సమయానికి మార్కెట్‌లో రూ.0.24 లక్షల కోట్ల విలువైన (7శాతం) రూ.2,000 నోట్లు చెలామణిలో ఉన్నాయని ప్రకటించింది.
బ్యాంకుల వద్దకు తిరిగి వచ్చిన రూ.2000 నోట్లలో రూ. 3.32 లక్షల కోట్లలో దాదాపు 87శాతం నోట్లు కరెంటు, సేవింగ్, ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో ఆయా బ్యాంకు ఖాతాల్లో జమయ్యాయని పేర్కొంది. మిగతా 13 శాతం నోట్లను చిన్న డినామినేషన్ల రూపంలోకి మార్చుకున్నట్లు వివరించింది.
నెలాఖరుతో ముగియనున్న గడువు
మార్చి 31వ తేదీ నాటికి దేశంలో రూ.3.7లక్షల కోట్ల విలువైన ఇతర నోట్లతో కలిసి రూ.2000 నోట్లు చలామణీలో ఉన్నాయి. ఇతర నోట్లతో కలిపి కరెన్సీలో రూ.2వేల నోట్ల వాటా 10.8శాతం. ఆర్‌బీఐ ఉపసంహరణ ప్రకటన వచ్చిన మే 19 నాటికి వాటి విలువ రూ.3.56 లక్షల కోట్లకు తగ్గింది. రూ.2వేల నోట్లను మార్చుకోవడం, డిపాజిట్‌కు ఈ సెప్టెంబర్ 30 వరకు గడువు ఉన్నది.
ఈ నెలతో గడువు ముగియనున్న నేపథ్యంలో రూ.2వేల నోట్లు ఇంకా ఎవరి వద్ద అయినా ఉంటే మార్చుకోవాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ సూచించింది. సెప్టెంబరు 30 వరకు రూ.2వేల డినామినేషన్ నోట్లు లీగల్ టెండర్‌గా (చట్టబద్ధమైన కరెన్సీగా) కొనసాగుతుంది.
గడువు ముగిసిన తర్వాత రూ.2వేల నోట్లు ఉంటే.. చట్టరీత్యా నేరమే. అయితే, నోట్లను రద్దు చేయాలని ఆర్‌బీఐ ప్రభుత్వాన్ని కోరే ఛాన్స్ ఉంటుంది. దాంతో అవి చిత్తుకాగితాలుగా మారిపోనున్నాయి. అయితే, గడువును మరింత పొడగిస్తారా? లేదంటే.. రద్దు చేస్తారా? అన్నది సర్వత్రా చర్చనీయాశంగా మారింది.
అయితే, ఇప్పటికే మెజారిటీ నోట్లు బ్యాంకులకు చేరిందని, గడువును పొడిగించే ప్రసక్తి లేదని ఆర్‌బీఐ వర్గాలు పేర్కొంటున్నాయి. నోట్ల గతంలో ఆర్‌బీఐ శక్తికాంత దాస్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గడువు ముగిసిన తర్వాత నోట్లను రద్దు చేయాలని తాను ప్రభుత్వాన్ని కోరతానో.. లేదో ఖచ్చితంగా తెలియదని పేర్కొన్నారు.
