Lunar Eclipse | ఈ ఏడాది నాలుగు గ్రహణాలు సంభవించనున్న విషయం తెలిసిందే. ఇందులో తొలి సూర్యగ్రహణం ఇప్పటికే ఏర్పడింది. ఇక తొలి చంద్రగ్రహణం మే 5న ఏర్పడబోతున్నది. చంద్రుడు, సూర్యుడి మధ్య భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ గ్రహణం 8.45 గంటలకు మొదలై.. అర్ధరాత్రి ఒంటిగంట వరకు కొనసాగుతుంది. ఈ గ్రహణం పెనుంబ్రల్ చంద్రగ్రహణంగా ఖగోళ నిపుణులు పేర్కొంటున్నారు. భూమి నీడ చంద్రునిపై పడనప్పుడు దాన్ని పెనుంబ్రల్ చంద్రగ్రహణంగా పిలుస్తారు. […]

Lunar Eclipse | ఈ ఏడాది నాలుగు గ్రహణాలు సంభవించనున్న విషయం తెలిసిందే. ఇందులో తొలి సూర్యగ్రహణం ఇప్పటికే ఏర్పడింది. ఇక తొలి చంద్రగ్రహణం మే 5న ఏర్పడబోతున్నది. చంద్రుడు, సూర్యుడి మధ్య భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ గ్రహణం 8.45 గంటలకు మొదలై.. అర్ధరాత్రి ఒంటిగంట వరకు కొనసాగుతుంది. ఈ గ్రహణం పెనుంబ్రల్ చంద్రగ్రహణంగా ఖగోళ నిపుణులు పేర్కొంటున్నారు.

భూమి నీడ చంద్రునిపై పడనప్పుడు దాన్ని పెనుంబ్రల్ చంద్రగ్రహణంగా పిలుస్తారు. అయితే, చంద్రగ్రహణం సైతం భారత్‌లో కనిపించదని, యూరప్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, అంటార్కిటికా, మధ్య ఆసియా, పసిఫిక్ అట్లాంటిక్, హిందూ మహాసముద్రంలో కనిపించనున్నది. గ్రహణం దాని పూర్తి పరిమాణంలో మాత్రమే కనిపించడమే కాకుండా.. కాస్తంత అస్పష్టంగా ఉంటుందని ఖగోళ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇక ఈ ఏడాది రెండో చంద్రగ్రహణం అక్టోబర్‌ 28న ఏర్పడనున్నది. గ్రహణంలో భారత్‌లో కనిపించదని, దాంతో సూతకం ఉండదని జ్యోతిష్య పండితులు తెలిపారు.

Updated On 27 April 2023 1:21 PM GMT
Vineela

Vineela

Next Story