- 24 మంది ఎమ్మెల్యేలతో బాధ్యతలు
- ఖరారైన కొత్త మంత్రుల జాబితా
విధాత: కర్ణాటక (Karnataka) ముఖ్యమంత్రి సిద్ధరామయ్య క్యాబినెట్ శనివారం ప్రమాణం చేయనున్నది. కొత్తగా మరో 24 మందితో గవర్నర్ ప్రమాణం చేయించనున్నారు. ఢిల్లీలో సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్, పార్టీ కేంద్ర నాయకుల సమక్షంలో చర్చించి కాబోయే మంత్రుల జాబితాను ఖరారు చేసినట్టు పార్టీ వర్గాలు శుక్రవారం తెలిపాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాహుల్‌గాంధీని కలిసి బెంగళూరుకు బయలుదేరుతారు.
ఈ నెల 20న ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. వీరితోపాటు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రయాంక్ ఖర్గేసహా మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కూడా ప్రమాణం చేశారు.
అయితే, ఇప్పటి వరకు మంత్రులకు శాఖల కేటాయింపు జరగలేదు. వివిధ వర్గాలను సమతూకం చేసి ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో శాఖల కేటాయింపుపై కాంగ్రెస్ కసరత్తు చేస్తున్నది.