మేష రాశి: శరీర సౌఖ్యము లభిస్తుంది. శుభకార్యమూలక ధనవ్యయము కలుగుతుంది. పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. ప్రయత్నకార్యాలు సిద్ధిస్తాయి. భోజన సౌఖ్యము కలుగుతుంది.
వృషభ రాశి: చిరకాలు కోరికలు సిద్ధిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధు మిత్రుల ఆదరణ లభిస్తుంది. శరీర ఉల్లాసముతో సంతోషంగా గడుపుతారు. ధన ప్రాప్తి కలుగుతుంది.
మిథున రాశి: ఇష్టమైన వ్యక్తులను కలుస్తారు. కార్యనిర్వహణా సామర్థ్యమును ప్రదర్శిస్తారు. నూతన శుభములు కలుగుతాయి. ధన, ధాన్య లాభములుంటాయి. సంతోషంగా రోజంతా గడుపుతారు.
కర్కాటక రాశి: నూతన ఆవిష్కరణలు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంగారు వస్తువులు సంగ్రహిస్తారు. జీవిత భాగస్వామితో ఉల్లాసంగా గడుపుతారు. ధనలాభము సంతోషాన్నిస్తుంది.
సింహ రాశి: మనోవ్యాకులము చెందుతారు. చేస్తున్న పనిని మధ్యలోనే వదిలేస్తారు. కుటుంబ సభ్యుల మూలకంగా అశాంతి కలుగుతుంది. వస్తు నష్టములు బాధిస్తాయి.
కన్యా రాశి: శుభ ప్రయోజనముల విషయమై కొత్త వ్యక్తులను కలుస్తారు. వ్యాపారస్థులు నూతన ప్రణాళికలు అమలు చేస్తారు. పరోపకారముతో మనోల్లాసాన్ని పొందుతారు. కీర్తి, ధనలాభములు కలుగుతాయి.
తుల రాశి: మనోధైర్యముతో కార్యములు సిద్ధిస్తాయి. కొత్త వస్తువులను సంగ్రహిస్తారు. వివాదాలలో పై చేయి సాధిస్తారు. విద్యార్థులు కొత్త విషయాలను తెలుసుకుంటారు. ధనప్రాప్తి, స్వల్పముగానే వుంటుంది.
వృశ్చిక రాశి: అనుచరుల మూలకంగా లాభం కలుగుతుంది. నూతన స్నేహములు లాభిస్తాయి. మంచి మాటలను వినడంతో ఆనందం కలుగుతుంది. ఆకస్మిక ధనలాభము సంతోషాన్నిస్తుంది.
ధనుస్సు రాశి: రాదనుకున్న ధనము చేతికందుతుంది. సామాజిక కార్యక్రమాలలో ముందుంటారు. క్రీడాకారులకు లాభకరంగా వుంటుంది. అనుకున్న పనులు సాఫీగా పూర్తవుతాయి.
మకర రాశి: భయం మూలంగా ఇబ్బందుల నెదుర్కుంటారు. పితృ వర్గము వారితో విభేదాలు రావచ్చును. జ్వరాది అనారోగ్య బాధలు కలుగవచ్చును. నమ్మకం కోల్పోయే ప్రమాదముంది, జాగ్రత్తగా వ్యవహరించండి.
కుంభ రాశి: వాక్చాతుర్యముతో పనులు నెరవేరుతాయి. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆటంకాలను ధైర్యంగా ఎదుర్కొంటారు. వృత్తిలో అనుకూలతలు సంతోషాన్ని కలుగజేస్తాయి.
మీన రాశి:- శరీర ఆరోగ్యమునకై ధనవ్యయముంటుంది. అపవాదులు బాధిస్తాయి. దుర్జనుల మాటలను విని నష్టపోయే ప్రమాదమున్నది. వస్తు నష్టములు కలుగవచ్చును. నిరుత్సాహమును రానీయకండి.
– తూండ్ల కమలాకర శర్మ సిద్ధాంతి,
కూకట్‌పల్లి, హైదరాబాద్
ఫోన్ నంబర్ : +91 99490 11332.
26.02.2023 ఆదివారం రాశి ఫలాలు.. ఈరాశి వారికి కోరుకున్న పనులు సాఫీగా సాగుతాయి
26.02.2023 నుంచి 04.03.2023 వరకు వార ఫలాలు.. ఆ రాశుల వారికి నూతన వస్తు ప్రాప్తి, శుభవార్తలు