విధాత‌: బైజూస్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ కంపెనీ బైజూ కీలక నిర్ణయం తీసుకుంది. 2023 మార్చి నాటికి బైజూస్ 5 శాతం అంటే 2,500 మంది ఉద్యోగులను తొలగించి. 10,000 మంది ఉపాధ్యాయులను నియమించాలని నిర్ణయించింది. బైజూస్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు దివ్య గోకుల్ నాథ్ మాట్లాడుతూ.. కొత్త భాగస్వామ్యాల ద్వారా విదేశాల్లో బ్రాండ్‌పై అవగాహన పెంపొందించడం మీద కంపెనీ దృష్టి పెట్టినట్టు ఆయన వివరించారు. ఇది కాకుండా భారతీయ, విదేశీ బిజినెస్‌ కోసం 10,000 మంది ఉపాధ్యాయులను […]

విధాత‌: బైజూస్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ కంపెనీ బైజూ కీలక నిర్ణయం తీసుకుంది. 2023 మార్చి నాటికి బైజూస్ 5 శాతం అంటే 2,500 మంది ఉద్యోగులను తొలగించి. 10,000 మంది ఉపాధ్యాయులను నియమించాలని నిర్ణయించింది.

బైజూస్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు దివ్య గోకుల్ నాథ్ మాట్లాడుతూ.. కొత్త భాగస్వామ్యాల ద్వారా విదేశాల్లో బ్రాండ్‌పై అవగాహన పెంపొందించడం మీద కంపెనీ దృష్టి పెట్టినట్టు ఆయన వివరించారు. ఇది కాకుండా భారతీయ, విదేశీ బిజినెస్‌ కోసం 10,000 మంది ఉపాధ్యాయులను నియమించుకోనుంది.

భారతదేశం అంతటా మా బ్రాండ్‌ను విస్తరించి ప్రజల్లోకి చొచ్చుకెళ్లామని.. మార్చి 2023 నాటికి లాభాల్లోకి రావాలని భావిస్తున్నామని అన్నారు. దీని కోసం మార్కెటింగ్ బడ్జెట్ పెంచుతూ.. ఖర్చులను తగ్గించేందుకు ట్రై చేస్తున్నామని అన్నారు.

పనికిరాని ఖర్చులను నిరోధించడానికి మాకు ఈ కొత్త వ్యూహం సహాయపడుతుందని చెప్పారు. ట్యూషన్ సెంటర్లు, ఆన్ లైన్ లెర్నింగ్ మోడల్ కోసం 10,000 మంది ఉపాధ్యాయులను నియమించాలని భావిస్తున్నట్టు తెలిపారు. 2021 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో బైజూస్ రూ.4,588 కోట్ల నష్టాన్ని చవిచూసింద‌ని తెలిపారు.

Updated On 13 Oct 2022 12:38 PM GMT
Somu

Somu

Next Story