మేష రాశి: సత్కారాలు లభిస్తాయి. నూతన వస్త్రధారణ చేయుదురు. స్థిరాస్థి మూలక లాభాలుంటాయి, ప్రయాణములు చేయుదురు. రాజకీయ నాయకులు వివాదాలను పరిష్కరించుకుంటారు. వృషభ రాశి: ఆకస్మిక సంఘటనలు బాధిస్తాయి. విదేశీయాన ప్రయత్నములు వాయిదా పడతాయి. ఖర్చులు పెరుగుతాయి. అవమానాలు ఎదురౌతాయి. ద్వేషం మూలకంగా అశాంతి కలుగుతుంది. మిథున రాశి: ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. బంధుమిత్రులతో కలయికలుంటాయి. సంతాన మూలకంగా ఆనందం లభిస్తుంది. ఇంట్లో శుభకార్య సంబంధ పనులు నిర్వహిస్తారు. కర్కాటక రాశి: ఎన్నాళ్ళుగానో ప్రయత్నిస్తున పనులకు సానుకూలత […]

మేష రాశి: సత్కారాలు లభిస్తాయి. నూతన వస్త్రధారణ చేయుదురు. స్థిరాస్థి మూలక లాభాలుంటాయి, ప్రయాణములు చేయుదురు. రాజకీయ నాయకులు వివాదాలను పరిష్కరించుకుంటారు.

వృషభ రాశి: ఆకస్మిక సంఘటనలు బాధిస్తాయి. విదేశీయాన ప్రయత్నములు వాయిదా పడతాయి. ఖర్చులు పెరుగుతాయి. అవమానాలు ఎదురౌతాయి. ద్వేషం మూలకంగా అశాంతి కలుగుతుంది.

మిథున రాశి: ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. బంధుమిత్రులతో కలయికలుంటాయి. సంతాన మూలకంగా ఆనందం లభిస్తుంది. ఇంట్లో శుభకార్య సంబంధ పనులు నిర్వహిస్తారు.

కర్కాటక రాశి: ఎన్నాళ్ళుగానో ప్రయత్నిస్తున పనులకు సానుకూలత లభిస్తుంది. సత్ప్రవర్తనతో గౌరవమర్యాదలు పొందుతారు. అతిగా భయపడకండి. వృత్తి, ఉద్యోగాదులలో వృద్ది వుంటుంది.

సింహ రాశి: వస్తు నష్టము మూలకంగా అశాంతి కలుగుతుంది. వృథా సంచార‌ములుంటాయి. భయం వలన అవకాశాలను వదులుకుంటారు. ఎముకలు, నరాలకు సంబంధించిన బాధలుంటాయి.

కన్యా రాశి: ఉదర సంబంధమైన బాధలుంటాయి. ఇష్టంలేని పనులను చేయవలసి వస్తుంది. భోజన సౌఖ్యముండదు. శత్రువులు మిత్రులౌతారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది.

తులా రాశి: శత్రు బాధలు మనశ్శాంతిని దూరం చేస్తాయి. సంతాన మూలక చికాకులుంటాయి. విలువైన వస్తువులు ప‌ట్లు జాగ్రత్త వహించండి. అపకీర్తి కలుగుతుంది.

వృశ్చిక రాశి: మీరు కోరుకున్న పనులు సాఫీగా సాగుతాయి. శరీర ఆరోగ్య‌ము ఉల్లాసాన్నిస్తుంది. అద్భుతమైన సందేశాలను వింటారు. భూ, గృహ ప్రయత్నములు అనుకూలిస్తాయి.

ధనుస్సు రాశి: వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రుల సహకారం ఆనందాన్నిస్తుంది. శుభకార్యములకు ధనాన్ని వెచ్చిస్తారు. శత్రుబాధలు తొలగిపోతాయి. మనోల్లాసం లభిస్తుంది.

మకర రాశి: వాక్చాతుర్యముతో పనులు పూర్తి చేసుకుంటారు. మనోధైర్యముతో ఆటంకాలను అధిగమిస్తారు. ఇష్టమైన వ్యక్తులతో కలయికలుంటాయి. పుణ్యక్షేత దర్శనము సంతోషాన్నిస్తుంది.

కుంభ రాశి: శరీర బాధలు కలుగుతాయి. పితృ వర్గము వారితో విరోధములు కలుగవచ్చును. ప్రయత్న కార్యములకు విఘ్నములు కలుగుతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోండి.

మీన రాశి: కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. బంగారు వస్తువులను సంగ్రహిస్తారు. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధు సన్మానము సంతోషాన్నిస్తుంది.

- తూండ్ల కమలాకర శర్మ సిద్ధాంతి,
కూకట్‌పల్లి, హైదరాబాద్
+91 99490 11332.

26.02.2023 నుంచి 04.03.2023 వ‌ర‌కు వార ఫ‌లాలు.. ఆ రాశుల వారికి నూతన వస్తు ప్రాప్తి, శుభవార్తలు

Updated On 26 Feb 2023 4:46 AM GMT
Somu

Somu

Next Story