మేషరాశి:- ఆకస్మిక ప్రమాదాలు జరుగవచ్చును. దుర్జనుల మూలక భయము కలుగవచ్చును. తల్లిదండ్రుల అనారోగ్యం అశాంతి కలిగిస్తుంది. ధన వ్వయము కావచ్చును.
వృషభరాశి:- వివాహప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ నాయకులు సత్ఫలితాలను పొందుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి, కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు.
మిథున రాశి:- క్షణికావేశం వలన ఇబ్బందులెదురౌతాయి. బంధుమిత్రులతో విభేదాలు రావచ్చును. అపవాదుల నెదుర్కొంటారు. ధనవ్వయము అధికంగా వుంటుంది. నిరుత్సాహము కలుగవచ్చును.
కర్కాటక రాశి:- సత్ప్రవర్తన మూలకంగా గౌరవం లభిస్తుంది. స్థిరాస్థి ప్రయత్నాలు లాభిస్తాయి. దూర ప్రాంతముల నుంచి శుభసమచారాన్ని అందుకుంటారు. ధన ప్రాప్తి కలుగుతుంది.
సింహరాశి:- బంధుమిత్రుల మూలంగా సౌఖ్యం లభిస్తుంది. సన్మానాది గౌరవములను పొందుతారు. అనుకున్న పనులను దిగ్విజయంగా పూర్తి చేస్తారు. భోజన సౌఖ్యము లభిస్తుంది.
కన్య రాశి:- కుటుంబ సభ్యుల మూలంగా ఆనందం లభిస్తుంది. విలువైన వస్తువులు ప్రాప్తిస్తాయి. వివాహ ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. వివాదాలు పరిష్కరించుకుంటారు. నష్టధనప్రాప్తి కలుగుతుంది.
తులా రాశి:- శరీర అనారోగ్యముల వలన వైద్యుని సంప్రదించవలసి వస్తుంది. కుటుంబ సభ్యులపై అపవాదులు బాధిస్తాయి, అకారణ కలహములుండవచ్చును. ఇతరుల సహాయం కోరవలసి వస్తుంది.
వృశ్చిక రాశి:- చేసిన పనులనే మళ్ళీ చేయవలసి వస్తుంది. కలహముల మూలకంగా అశాంతి కలుగవచ్చును. వాహనమూలక చికాకులు కలుగుతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోండి.
ధనుస్సు రాశి:- మంచి ఆలోచనలు కలుగుతాయి. శతృవులతో వివాదాలు పరిష్కారమయ్యే సూచనలున్నాయి, తీర్థయాత్రలు ఉల్లాసాన్నిస్తాయి. మొండి బకాయిలు వసూలవుతాయి.
మకర రాశి:- శరీర బలహీనతలు అశాంతి కలిగిస్తాయి. ఇష్టమైన వస్తువులను నష్టపోయే అవకాశముంది. కవి, పండితుల గ్రంథ రచనలకు ఆటంకాలు ఎదురౌతాయి. రావలసిన ధనం సమయానికి చేతికందదు.
కుంభ రాశి:- తల్లిదండ్రుల అనారోగ్యం మూలంగా అశాంతి కలుగవచ్చును. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. దైవ దర్శనాలు ఆనందాన్నిస్తాయి. శుభ కార్యమూలకు ధనవ్యయం కలుగుతుంది.
మీన రాశి:- సోదరులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం కుదుట పడుతుంది. వ్యాపారస్థులు భాగస్వాములతో చర్చలు జరుపుతారు. అపార్థాలు తొలగిపోతాయి. ధనలాభం కలుగుతుంది.
– తూండ్ల కమలాకర శర్మ సిద్ధాంతి,
కూకట్‌పల్లి, హైదరాబాద్
+91 99490 11332