Saturday, April 1, 2023
More
    Homelatest28.02.2023 మంగళవారం రాశి ఫ‌లాలు.. ఈ రాశుల వారికి అకారణ కలహాలు, శుభ వార్తలు

    28.02.2023 మంగళవారం రాశి ఫ‌లాలు.. ఈ రాశుల వారికి అకారణ కలహాలు, శుభ వార్తలు

    మేష రాశి: దుర్వార్త శ్రవణము కలుగవచ్చును. స్థిరాస్థి మూలక అశాంతి కలుగవచ్చును. అకారణ కలహములేర్పడ‌వచ్చును. అధికారుల మూలక‌ భయము కలుగవచ్చును. అధిక ధ‌న వ్వయ‌ము కలుగవచ్చును.

    వృషభ రాశి: సామాజిక బాధ్యతలు నిర్వహిస్తారు. దూర ప్రాంతాల నుంచి ధన, వస్తు లాభములు కలుగుతాయి. మంచి వ్యక్తులతో కలిసి సత్సంగంలో పాల్గొంటారు. వ్యాపారస్థులకు కార్యసిద్ది కలుగుతుంది.

    మిథున రాశి: ప్రయాణాలు అధికమౌతాయి. చేస్తున్న పనులకు ఆటంకాలు ఎదురౌతాయి. జ్వ‌రముతో బాధ పడతారు. కోర్టు వ్యవహారాలు వాయిదా వేయండి. ఖర్చులు పెరుగుతాయి.

    కర్కాటక రాశి: శరీక బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది. నూతన వస్తువులు లభిస్తాయి. ఇష్ట‌మైన వ్యక్తులతో కలయికలుంటాయి. సంతానమూలకంగా సంతోషాన్ని పొందుతారు.

    సింహ రాశి: దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. దాన ధర్మాధి కార్యములు నిర్వహిస్తారు. సంఘంలో గౌరవం లభిస్తుంది.

    కన్యా రాశి: అందరి అభిమానము లభిస్తుంది. విద్యార్థులు చర్చలలో పాల్గొనడం వలన ఉల్లాసాన్ని పొందుతారు. శ‌త్రువులు మిత్రులవుతారు. స్థిరాస్థి ప్రయత్నాలు ఫలిస్తాయి.

    తులా రాశి: వ్యాపారస్థులకు అపవాదులు రాకుండా జాగ్ర‌త్త పడండి. రాజ‌కీయ‌ నాయకులకు వ్యతిరేక ఫలితాలు ఆందోళ‌న‌ కలిగిస్తాయి. క్రీడాకారులకు శ్రమ ఎక్కువుంటుంది. శరీర బాధ‌లు క‌లుగ‌వచ్చును.

    వృశ్చిక రాశి: పెద్దలపై గౌరవమును కలిగి వుంటారు. కుటుంబ సభ్యుల సహకారం ల‌భిస్తుంది. విద్యార్థులు ప్రతిభతో ఆకట్టుకుంటారు. క్ర‌య విక్ర‌య‌ముల వలన ధనలాభం కలుగుతుంది.

    ధనుస్సు రాశి: సంభాష‌ణ‌లు సత్ఫలితాలనిస్తాయి. మీరు కోరుకున్న విధంగాన్నే ప‌నులు పూర్తవుతాయి. ప్రయాణాలు ఉల్లాసాన్నిస్తాయి. మేధావులు, పండితులు ప‌రిచ‌యాలు ఆనందాన్నిస్తాయి.

    మ‌క‌ర రాశి: వాత సంబంధ‌మైన శ‌రీర బాధ‌లు క‌లుగవ‌చ్చును. పితృ వ‌ర్గ‌ము వారితో విభేదాలు ఏర్పడవచును. భయం మూలకంగా అశాంతి కలుగవచ్చును. ప్రయత్న కార్యములకు ప్రతిబంధ‌కాలు ఏర్పడతాయి.

    కుంభ రాశి: కుటుంబ‌ములకూ సౌక్యం ల‌భిస్తుంది. బ‌హుమానములను పొందుతారు. శుభ‌కార్యాచ‌ర‌ణ‌ము చేస్తారు. స‌త్ప్ర‌వ‌ర్త‌న క‌లిగివుంటారు. ధనప్రాష్టి సంతోషాన్ని కలిగిస్తుంది.

    మీన రాశి: గౌర‌వ మ‌ర్య‌ద‌లు నిలుపుకుంటారు. ఆత్మ‌స్థైర్య‌ముతో ప్ర‌తికుల‌త‌ల‌ను అధిగ‌మిస్తారు. ముఖ్య‌మైన వ్య‌క్తుల‌తో క‌ల‌యిక సంతోషాన్నిస్తుంది. వివాహ ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయి.

    – తూండ్ల కమలాకర శర్మ సిద్ధాంతి,
    కూకట్‌పల్లి, హైదరాబాద్
    +91 99490 11332.

    spot_img
    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular