ముగ్గురు దుర్మ‌ర‌ణం.. తొమ్మిది మందికి గాయాలు జార్ఖండ్‌లోని పలాము జిల్లాలో అర్ధ‌రాత్రి ప్ర‌మాదం Jharkhand | విధాత‌: ర‌హ‌దారి వెంట న‌డుచుకుంటూ వెళ్తున్న జ‌నంపై ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు అక్క‌డిక‌క్క‌డే దుర్మ‌ర‌ణం చెందారు. మ‌రో తొమ్మిది మంది తీవ్ర‌గా గాయ‌ప‌డ్డారు. జార్ఖండ్‌లోని పలాము జిల్లాలో సోమ‌వారం అర్ధ‌రాత్రి ఈ ప్ర‌మాదం జ‌రిగింది. రాష్ట్ర రాజ‌ధాని రాంచీకి 175 కిలోమీట‌ర్ల దూరంలో చైన్‌ఫూర్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో ఉన్న బ‌రాన్ గ్రామంలో శ్రావణ మాసం చివరి […]

  • ముగ్గురు దుర్మ‌ర‌ణం.. తొమ్మిది మందికి గాయాలు
  • జార్ఖండ్‌లోని పలాము జిల్లాలో అర్ధ‌రాత్రి ప్ర‌మాదం

Jharkhand | విధాత‌: ర‌హ‌దారి వెంట న‌డుచుకుంటూ వెళ్తున్న జ‌నంపై ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు అక్క‌డిక‌క్క‌డే దుర్మ‌ర‌ణం చెందారు. మ‌రో తొమ్మిది మంది తీవ్ర‌గా గాయ‌ప‌డ్డారు. జార్ఖండ్‌లోని పలాము జిల్లాలో సోమ‌వారం అర్ధ‌రాత్రి ఈ ప్ర‌మాదం జ‌రిగింది.

రాష్ట్ర రాజ‌ధాని రాంచీకి 175 కిలోమీట‌ర్ల దూరంలో చైన్‌ఫూర్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో ఉన్న బ‌రాన్ గ్రామంలో శ్రావణ మాసం చివరి సోమవారం సందర్భంగా గ్రామంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేశారు. దీనికి హాజరైన గ్రామ‌స్థులు కొంద‌రు తిరిగి త‌మ ఇండ్ల‌కు చేరుకోవ‌డానికి రోడ్డు వెంట న‌డుచుకుంటూ బ‌య‌లుదేరారు.

వేగంగా వ‌స్తున్న కారు జ‌నంపై నుంచి దూసుకెళ్లింది. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయారు. మ‌రో తొమ్మిది మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. క్ష‌త‌గాత్రుల‌ను మెదినిరాయ్ ద‌వాఖాన‌కు త‌రలించారు. నిందితుడు కారు ఆప‌కుండా కారుతో స‌హా పారిపోయాడు. కేసు ద‌ర్యాపు చేస్తున్నామ‌ని, నిందితుడి కోసం ప్ర‌త్యేక బృందాల‌తో గాలిస్తున్నామ‌ని పోలీసులు మంగ‌ళ‌వారం వెల్ల‌డించారు.

Updated On 29 Aug 2023 1:46 PM GMT
somu

somu

Next Story