ప్రభాస్ అభిమానులకు ఇది కదా కావలసింది…!
విధాత: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రాల లిస్ట్ చాంతాడంత పెద్దది గానే ఉంది. చేతిలో అర డజన్‌కు పైగా చిత్రాలు ఉన్నాయి. మారుతితో చేస్తున్న చిత్రం, ఆది పురుష్, మైత్రి మూవీ మేకర్స్ లో సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వంలో చేయనున్న చిత్రం, దిల్ రాజు నిర్మాతగా సలార్ ఫేమ్ ప్రశాంతి నీల్‌తో రావణం, సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కెఇలా ఆయన లైనప్ చెప్పుకోవాలంటే చాలా పెద్దది.
ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న ప్రాజెక్టుల విలువ దాదాపు మూడు వేల కోట్ల వరకు ఉంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇక ఈ ఏడాది నుంచి ప్రతి ఏడాది ప్రభాస్ తన నుంచి రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ ఏడాదిలో ఓం రౌత్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఆది పురుష్, సలార్ చిత్రాలు విడుదల కానున్నాయి.
సలార్ చిత్రం కూడా రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం విడుదల ఇదే ఏడాదిలో కానుంది. ఈ మూవీ దాదాపు 400 కోట్ల బడ్జెట్లో తెరకెక్కుతోంది. ఇక వచ్చే ఏడాది ఆరంభంలో మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజా డీలక్స్, ఆ తరువాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతున్న ప్రాజెక్టుకె థియేటర్లోకి వచ్చే ఛాన్స్ లు ఉన్నాయి. దానితో పాటు మారుతి రాజా డీలక్స్ కూడా విడుదల కానుంది.
2025లో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో చేయబోయే స్పిరిట్ సినిమాతో పాటు సిద్ధార్ధ్ ఆనంద్‌తో చేయబోయే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇలా మూడేళ్లలో ఏడాదికి రెండేసి సినిమాల చొప్పున ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
ఇక సలార్ మొదటి భాగం ఈ ఏడాది సెప్టెంబర్ 28న విడుదల కానుంది. ఆదిపురుష్ జూన్ 16న విడుదల కానుంది. ఈ సినిమాలకు సంబంధించి కౌంట్‌డౌన్ కూడా స్టార్ట్ చేశారు. ఆది పురుష్ 3D మరో 150 రోజుల్లో రాబోతుందని ఈనెల 17న సినిమా టీమ్ ప్రకటించింది.
సలార్ బృందం జనవరి 21 శనివారం రోజున మరో 250 రోజుల్లో సినిమా విడుదల కానుందని అధికారికంగా తెలిపింది. మొత్తానికి ఈ లైనప్ చూసుకుంటే ప్రభాస్ అభిమానులు ఇది కదా కావాల్సింది..! ఇక మా యంగ్ రెబెల్ స్టార్ కు పోటీ ఎవ్వరు లేరంటూ ఆనంద పడిపోతున్నారు.