Morocco మొరాకో, లిబియాలో వేల మంది మృత్యువాత విధాత: ప్రకృతి వైపరీత్యాలు లిబియా, మొరాకో దేశలను వణికించాయి. వేల మంది ప్రాణాలను బలిగొన్నాయి. ఆఫ్రికన్‌ దేశం లిబియాలో డెనియల్‌ తుఫాను, వరదల విధ్వంసం 2వేల మందికి పైగా ప్రాణాలను బలితీసుకుంది. తుఫాను ధాటికి బహుళ అంతస్తుల భవనాలు అనేకం బురదలో కూరుకుపోయాయి. తూర్పు ప్రాంతం డెర్నాలో తుఫాను, వరద నష్టం అధికంగా ఉండగా, చాలి మంది నీటిలో కొట్టుకపోగా, వేలాది మంది గల్లంతయ్యారు. The first moments […]

Morocco

  • మొరాకో, లిబియాలో వేల మంది మృత్యువాత

విధాత: ప్రకృతి వైపరీత్యాలు లిబియా, మొరాకో దేశలను వణికించాయి. వేల మంది ప్రాణాలను బలిగొన్నాయి. ఆఫ్రికన్‌ దేశం లిబియాలో డెనియల్‌ తుఫాను, వరదల విధ్వంసం 2వేల మందికి పైగా ప్రాణాలను బలితీసుకుంది. తుఫాను ధాటికి బహుళ అంతస్తుల భవనాలు అనేకం బురదలో కూరుకుపోయాయి. తూర్పు ప్రాంతం డెర్నాలో తుఫాను, వరద నష్టం అధికంగా ఉండగా, చాలి మంది నీటిలో కొట్టుకపోగా, వేలాది మంది గల్లంతయ్యారు.

మొరాకో ప్రధాని ఒసామా హమద్‌ మూడు రోజు సంతాప దినాలు ప్రకటించారు. దేశ వ్యాప్తంగా జెండాలను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. వరదల కారణంగా అనేక నగరాల్లో ఇండ్లు, ఇతర ఆస్తులు ధ్వంసమవ్వగా, ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. మరిన్ని వర్షాలు కురిసే అవకాశముంది ఆ దేశ వాతావరణ శాఖ హెచ్చరించింది. కాగా తుఫాన్‌ విధ్వంసానికి గురైన లిబియాకు సహాయక చర్యలలో భాగంగా టర్కీ దేశం మూడు విమానాలను పంపించింది.

మొరాకోలో 3వేలకు చేరిన భూకంప మృతులు

మొరాకో దేశంలో సంభవించిన పెను భూకంపంలో మృతుల సంఖ్య 3వేలకు చేరువైంది. మంగళవారం ఉదయం స్థానిక అధికారుల లెక్కల మేరకు మృతుల సంఖ్య 2,890కి చేరింది. తీవ్రంగా గాయపడిన మరో 2,500మందిలో పలువురి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య 3వేలకు చరుకోనుందని అంచనా.

భూకంపకం ధాటికి కుప్ప కూలిన భవనాల శిథిలాల తొలగిస్తు ఉంటే కుప్పలుగా మృతదేహాలు బయటపడుతున్నాని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని మొరాకో అధికార వర్గాలు వెల్లడించాయి.

Updated On 12 Sep 2023 10:59 AM GMT
somu

somu

Next Story