Morocco | మొరాకో దేశంలో శుక్ర‌వారం రాత్రి భారీ భూకంపం సంభ‌వించింది. భూకంప ధాటికి 296 మంది మృతి చెందిన‌ట్లు మీడియా పేర్కొంది. మొరాకోలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఉపరితలం నుంచి 18 కిలోమీటర్ల లోతులో ఈ శక్తివంతమైన భూకంపం వచ్చింది. మొరాకోలోని రాబాత్ నుంచి మరకేష్ వరకు వచ్చిన భారీ భూకంపంతో ప్రజలు వణికిపోయారు. ఈ భూకంపం వల్ల పలు భవనాలు దెబ్బతిన్నాయి. టూరిస్టు […]

Morocco | మొరాకో దేశంలో శుక్ర‌వారం రాత్రి భారీ భూకంపం సంభ‌వించింది. భూకంప ధాటికి 296 మంది మృతి చెందిన‌ట్లు మీడియా పేర్కొంది. మొరాకోలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఉపరితలం నుంచి 18 కిలోమీటర్ల లోతులో ఈ శక్తివంతమైన భూకంపం వచ్చింది. మొరాకోలోని రాబాత్ నుంచి మరకేష్ వరకు వచ్చిన భారీ భూకంపంతో ప్రజలు వణికిపోయారు. ఈ భూకంపం వల్ల పలు భవనాలు దెబ్బతిన్నాయి. టూరిస్టు సిటీ మ‌ర‌కేష్‌లో 820 మంది చ‌నిపోయిన‌ట్లు మీడియా పేర్కొంది.

2004లో మొరాకోలో సంభ‌వించిన భూకంప ధాటికి 628 మంది ప్రాణాలు కోల్పోగా, 926 మంది తీవ్ర గాయాల‌పాల‌య్యారు. 1980లో అన్సాంలో భూకంపం సంభ‌వించ‌గా తీవ్ర‌త‌ రిక్ట‌ర్ స్కేలుపై 7.3గా న‌మోదైంది. నాటి భూకంప ధాటికి 2,500 మంది చ‌నిపోగా, 3 ల‌క్ష‌ల మంది నిరాశ్ర‌యుల‌య్యారు.

Updated On 9 Sep 2023 11:55 AM GMT
sahasra

sahasra

Next Story